India-Israel: భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నూర్ గిలోన్ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కృషి భవన్‌లో కలిశారు.భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా బాధ్యతలు స్వీకరించినందుకు తోమర్ ఆయనకు అభినందనలు తెలిపారు. భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కేంద్ర మంత్రి తోమర్ సంతోషం వ్యక్తం చేశారు. 12 రాష్ట్రాల్లో 25 మిలియన్లకు పైగా కూరగాయల మొక్కలు, 387 వేలకు పైగా నాణ్యమైన పండ్ల మొక్కలను ఉత్పత్తి చేస్తున్న 29 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రి తోమర్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చుట్టూ ఉన్న 150 గ్రామాలను విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చాలని నిర్ణయించామని అయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలు పీఎం-కిసాన్, అగ్రి-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, 10 వేల ఎఫ్‌పీఓల ఏర్పాటు, ప్రమోషన్ కోసం పథకాలను కూడా తోమర్ హైలైట్ చేసి మాట్లాడారు.
Also Read: వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
కాగా.. ఇజ్రాయెల్ రాయబారి శ్రీ గిలోన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ICAR ఇన్‌స్టిట్యూట్‌ల పనితీరును అంబాసిడర్ ప్రశంసించారు. ICARతో మరింత సహకారం మరియు ఇజ్రాయెల్‌తో అందుబాటులో ఉన్న తాజా సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడానికి అయన ఆసక్తిని కనబరిచారు. రైతులకు అందజేస్తున్న సేవల ప్రమాణాలు మరియు నాణ్యతను మరింత పెంచేందుకు ఆయన ఆసక్తి చూపించారు. కాగా.. ఇజ్రాయెల్‌లో పర్యటించాల్సిందిగా కేంద్ర మంత్రి తోమర్‌ను ఆయన ఆహ్వానించారు. ఈ మేరకు తోమర్ సానుకూలంగా స్పందించారు.
Also Read: ఏపీ రైతులకు శుభవార్త : ఇక వ్యవసాయ రంగంలోనూ వాలంటీర్ వ్యవస్థ – ఆర్బీకేలు (RBK) పగలంతా తెరిచుండేలా