India Caps Rice Exports: ప్రపంచంలోనే బియ్యం ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. మన భారత దేశం బియ్యం ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో గత నెల రోజులుగా పెరుగుతున్న ధరలు నియంత్రించడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. పెరుగుతున్న ధరలను నియంత్రించడం కోసం ప్రభుత్వం బియ్యం ఎగుమతుల పై నిషేధం ప్రకటించింది. ఎగుమతుల పై నిషేధం విధించే వరకు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు బియ్యం కొనుగోలుకు ఎగబడ్డారు.
అమెరికా, కెనడా లాంటి దేశాలలో ఉన్న భారతీయులు బియ్యం ధరలు పెరుగుతాయి అని అక్కడి ప్రజలు కొన్ని నెలలకు సరిపోయే బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎగుమతులు ఆగిపోవడం అదునుగా చేసుకున్న సూపర్ మార్కెట్లో బియ్యం ధరలు ఒకేసారిగా పెంచారు. ఇప్పుడు 10 కిలోల బియ్యం సుమారు 18 డాలర్లు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని సూపర్ మార్కెట్లో బియ్యం స్టాక్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది.
Also Read: Kitchen Essentials Price Hike: టమాట ధరతో పోటీ పడుతున్న అల్లం, చింతపండు ధరలు..
విదేశాల్లో ఉండే భారతీయులు ఎక్కువ ఆహారంగా బియ్యాన్ని తింటారు. ప్రస్తుతం భారతదేశం నుంచి బాస్మతియేతర బియ్యం ఎగుమతి ఆపడంతో భారతీయులు బియ్యం కొనుగోలు చేయడం కోసం పోటీపడ్డారు. ఇప్పుడు విదేశాల్లో ఉండే భారతీయులు బియ్యం కొన్నాడానికి పెద్ద పెద్ద క్యూ లలో గంటలు గంటలు నిలబడి ఉంటున్నారు. బియ్యం ధరలు పెరగకుండా ఎగుమతు ఆపడం కొంత వరకు మంచిది కానీ ఎగుమతులు పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తే మనకే ఇబ్బంది. బియ్యం ఉత్పత్తుల ఎలా పెంచాలి అని ఆలోచిస్తే రైతులకి, సామాన్యులకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
Also Read: Organic Farming: సేంద్రియ వ్యవసాయం నుంచి ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారు.?