International Tiger Day 2023: ఎవరినైనా భయపెట్టాలంటే అమ్మో పులి అంటాం. అంటే పులి అంటే మనుషులకు ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు. కాని విచిత్రంగా పులల సంఖ్య దారుణంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతరించిపోయే జంతువుల జాబితాలో పులులు చేరాయి. పులులు అంతరించిపోయిన రెండు దశాబ్దాల్లో భూమిపై మనుషులు కూడా జీవించడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్న మాటలు ఆందోళన కలిగిస్తున్నారు. పులులు లేకుండా అడవులు అంతరించిపోతాయని, అడవులు లేకుంటే మనిషికి కావాల్సిన ఆక్సిజన్ కూడా దొరకడం కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పులుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు. పులుల పరిస్థితి ప్రపంచంలో ఎలా ఉందో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య పెరుగుతోంది
ప్రపంచంలో పులల సంఖ్య 4500గా ఉంది. 2015 వీటి సంఖ్య 3500కుపడిపోవడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. పులుల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. పులుల సంఖ్యను పెంచేందుకు ఏఏ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక నిర్ణయం తీసుకుని, అంతర్జాతీయ పులల దినోత్సవం జరుపుకోవడం ద్వారా విద్యార్థులు, పిల్లలు, పౌరులకు పులల ఆవశ్యకతను వివరించే కార్యక్రమం చేపట్టారు.ఇండియాలో ప్రస్తుతం 2987 పులులు ఉన్నాయి. వీటి సంఖ్య ఏటా 8 శాతం పెరుగుతోంది. పులల సంఖ్య పెరిగిన తరవాత అటవీ విస్తీర్ణం కూడా పెరుగుతోందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
Also Read: PM Kisan Seva Kendras in Telangana: తెలంగాణలో నాలుగు వేల ప్రధాని కిసాన్ సేవా కేంద్రాలు.!

International Tiger Day 2023
పులుల జీవన విధానం
పులులు సుమారు 20 సంవత్సరాలు జీవిస్తాయి. ఒకేసారి రెండు మూడు పిల్లలను కంటాయి. పిల్లలకు కొంత కాలం కళ్లు కనిపించవు. తల్లి పులి నుంచి వచ్చే వాసనతో అవి ఫాలో అవుతూ ఉంటాయి. రెండు సంవత్సరాల తరవాత తల్లి పులి పిల్లలను వదిలేస్తుంది. ఆ పిల్లలు అప్పటి నుంచి స్వయంగా జీవిస్తాయి. పులులు ఒంటరిగా జీవిస్తాయి. సింహాలు మాత్రం గుంపులుగా జీవిస్తాయి. పులులు నాలుగో ఏట నుంచి మరలా పిల్లలను పెట్టడానికి రెఢీ అవుతాయి. సగటున పులి బరువు 200 నుంచి 300 కిలోలు ఉంటుంది. ఆడపులి ఒకేసారి 35 కేజీల మాంసం తినగలదు. ఇక పులులు చలికి, ఆకలికి తట్టుకోలేక ఎక్కువగా మరణిస్తున్నాయి. అంతేకాదు…వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి బలైపోతున్నాయి. పులులన్నీ ఒకే రకంగా ఉన్నట్టు అనిపించినా ఏ రెండు పులల సారలు ఒకే రకంగా ఉండవు. పులల ముందు కాళ్లు చిన్నగా వెనక కాళ్లు పొడవుగా ఉంటాయి. అందుకే అవి గంటకు 65.కిమీ వేగంతో పరుగెత్తి వేటాడతాయి.
పులులను కాపాడండి
మనుషులు పులులను రక్షించుకుంటే వారిని వారు కాపాడుకున్నట్టే. ఎందుకంటే పులులు లేకుంటే ఇప్పటికే అడవులు అంతరించిపోయి ఉండేవి. పులల భయంతో చాలా మంది అటవిని నరకడానికి భయడుతున్నారు. అందుకే పులలను కాపాడుకుందాం…మానవజాతిని రక్షించుకుందాం.
Also Read: High Yield Hybrid Chilli Varieties: మిర్చి నారు లో హైబ్రిడ్ రకాలను ఎంచుకున్న రైతులు.!