Bell Pepper Farming: సాంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను కూడా సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యవసాయ రంగంలో మార్పులు చూడొచ్చు. కాప్సికం సాగుతో మంచి ఆదాయం వస్తుంది. అయితే క్యాప్సికం మన దేశంలోనే కాకుండా అమెరికాలో క్యాప్సికం పంటను సాగు చేసి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు రైతులు. అయితే అమెరికాలో క్యాప్సికం పంట గురించి భారతీయురాలు స్వరాజ్య లక్మి (ShwaaraVlogs) వివరించారు. తన యూట్యూబ్ ఛానెల్ లో అమెరికా క్యాప్సికం సాగుపై తన అనుభవాలను తెలియజేశారు. మరి ఆమె ఏమంటుందో చూద్దాం…
నాలుగు రంగుల క్యాప్సికం (Capsicum) రకాలను పండిస్తున్నారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, ఆరెంజ్ లను సాగు చేస్తున్నారు. అయితే ఈ రకం పంటను కూరలో కంటే సలాడ్ లోనే ఉపయోగిస్తారు. ఇక పంట తయారైంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే.. క్యాప్సికం పై భాగాన మన చేతి వేలు పట్టింది అంటే ఆ కాయ తయారైంది అని చెప్తున్నారు రైతులు. ఒక్కో చెట్టుకు 12 కాయలు కాస్తాయి. అదే ఎరుపు రంగు కాయలు అయితే 6 నుంచి 10 కాయలు మాత్రమే కాస్తాయి. కొన్ని కాయలు ఎండకు ఎండిపోవడం జరుగుతుంది. అయితే పంటకు ఎలాంటి తెగులు, పురుగు పట్టకుండా పంట ఎంతో ఆరోగ్యంగా ఉంది.
Also Read: భారత్ కు అమెరికా పంది ఉత్పత్తులు..
పంటను కోసిన వెంటనే ప్రోసెసింగ్ చేస్తారు. ప్రోసెసింగ్ తర్వాత స్టోరేజి చేయకుండా 24 గంటల వ్యవధిలోనే మార్కెట్లోకి పంట వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఎరుపు, ఆరెంజ్, పసుపుతో పోల్చుకుంటే ఆకుపచ్చ రంగు కాయల ధర తక్కువగా ఉంటుంది. పంటను తెల్లవారుజామున 4 గంటలకే కోత మొదలుపెడతారు.
అమెరికాలో కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువగా క్యాప్సికం పంట సాగు చేస్తారు. ప్రపంచంలో క్యాప్సికం పంటను సాగు చేయడంలో మన దేశం 4వ స్థానంలో ఉంది. అమెరికాలో క్యాప్సికం సాగు రైతులకు ఎకరానికి రూ. 2.75 లక్షల ఆదాయం ఉంటుంది. అయితే క్యాప్సికం రంగు మారినా, కొంచెం పాడైపోయిన వాటిని అమ్మకుండా పంటలోనే ఉంచుతున్నారు. ఇలా చేయడం ద్వారా పంటకు బలాన్నిస్తుంది అని అమెరికా రైతులు చెప్తున్నారు. మరో విశేషం ఏంటంటే అమెరికాలో వ్యవసాయ యంత్రసామాగ్రి కొనుగోలుపై ఎటువంటి ప్రభుత్వ టాక్స్ ఉండదు. రైతులకు ఎక్కువగా కూలీ ఖర్చు ఉంటుంది. అందుకే అమెరికన్ రైతులు అగ్రి మిషన్ లనే వాడుతుంటారు.
Also Read: భారత్ నుంచి మామిడి దానిమ్మ అమెరికాకు ఎగుమతి