Insult to Farmer: దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహేంద్ర సంస్థ సోషల్ మీడియా వేదికగా విమర్శల పాలవుతుంది. ఒక రైతును అవమానించినందుకు ఆ సంస్థపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మనిషి ఆహార్యాన్ని చూసో, వేషధారణ చూసో తక్కువ అంచనా వేయకూడదు అంటూ మండి పడుతున్నారు. నిజానికి మనిషి రూపాన్ని చూసి హేళన చేసే వాళ్లే ఎదో ఒక సందర్భంలో అందరిలోనూ నవ్వులు పాలవ్వడమే కాక క్షమాపణ కోరే పరిస్థితిని తెచ్చుకుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది.

Insult to the Farmer
కర్ణాటక లోని తుముకూర్ ప్రాంతంలో ఓ మహీంద్రా కార్ల షోరూమ్‌కు కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్కు కొనుగోలు చేసేందుకు వెళ్ళాడు. అయితే లోపలకు వెళ్లిన క్రమంలో ఆ రైతు, అతని స్నేహితుల రూపం, వస్త్రాలంకరణను చూసి హేళన చేస్తూ తన వక్ర బుద్ధి చూయించాడు అందులో పని చేసే సేల్స్ మెన్. కారు మీరు అనుకున్నట్లు రూ.10 కాదు అంటూ తక్కువ చేసి మాట్లాడాడు. అయితే ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. రైతును ఉద్దేశిస్తూ సేల్స్‌మ్యాన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది.
సేల్స్ మెన్ అన్న మాటలకు ఆ రైతుకు పట్టలేని కోపం వచ్చింది. గంటలో 10 లక్షలతో వస్తాను నాకు వెంటనే కారు డెలివరీ కావాలని షోరూమ్ సిబ్బందికి చెప్పాడు. అనంతరం తుముకూర్లోని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్లో షోరూమ్ సిబ్బందిపై కంప్లైంట్ చేశారు. దీంతో సేల్స్‌మ్యాన్, ఇతర ఉద్యోగులు తమ తప్పు తెలుసుకున్నారు. కెంపెగౌడకు బహిరంగా క్షమాపణలు చెప్పారు. అంతేకాదు రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.. వివాదానికి ముగింపు పలికారు.
Also Read: బీడు భూమిలో బంగారు పంటలు పండిస్తున్న రైతు జయరాం

Insult to the farmer in the Mahindra showroom
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియో మెగాస్టార్ చిరంజీవి సినిమా స్నేహం కోసం లో ఉన్న సీన్ ని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిరు డ్యూయల్ రోల్ పోషించిన స్నేహం కోసం సినిమా ప్రారంభంలోనే చిన్న చిరంజీవి, తన యజమాని విజయ్ కుమార్ తో కలిసి ఆటోలో మూటతో కార్ల షోరూమ్ కు వెళ్లడం, వాళ్ల తీరుతెన్ను చూసి షోరూమ్ వాడు చిరును అవమానించడం, గోనె సంచిలో డబ్బులు కిందికి పోయగానే సార్ క్షమించండంటూ వేడుకోవడం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి సీనే కర్ణాటకలోని మహీంద్రా షోరూమ్ లో జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఒక రైతు దేశానికి అన్నం పెట్టడమే కాదు తేడా వస్తే తాట తీస్తాడు అని నీరుపించాడంటూ ఆ రైతుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: వేలాది ఎకరాల్లో పంట నష్టం…మిర్చి రైతులను నిండా ముంచిన తామర పురుగు
Mahindra Car showroom salesman taunted a farmer aftr seeing his attire when he visited showroom to buy Bolero Pik-up. Farmer Kempegowda alleged field officer of showroom made fun of farmer & his attire, told him tat car is not worth 10 rupees for him to buy. @anandmahindra pic.twitter.com/9fXbc5naY7
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) January 23, 2022