ప్రకృతి నుంచి వచ్చేది ప్రతీది మానవుడి సొంతం. ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది. అందులో తేనె ఒకటి. ప్రకృతిలో విరభూసిన పువ్వుల నుండి మకరందాన్ని తేనెటీగలు సేకరించి మనకు అందిస్తున్నాయి. తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన వరం. కల్తీ లేని తేనె మనకు ప్రకృతి నుండి లభిస్తుంది. ఒకప్పుడు తేనె ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం మన దేశంలో తేనె ఏరులై పారుతుంది.
తేనె ఉత్పత్తి అధికమవ్వడానికి ప్రభుత్వం కృషి ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో తేనె ఉత్పత్తి అధికంగా కనిపిస్తుంది. మన దేశంలో దీని ఉత్పత్తి గణనీయంగా పెరిగింది అని తెలిపారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. నేడు అయన దేశ రాజధాని ఢీల్లీలో కిసాన్ భావం లో బికిపర్స్ సమావేశంలో పలు అమాశాలపై మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ తేనె ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం నుండి 500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో పది వేలకు పైగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ వచ్చాయన్నారు. ముఖ్యంగా తేనే, ఫలాలు పండించేందుకు అనువుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం చక్కని ఫలితాలు ఇచ్చిందని ఆయన అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న విధానాల కారణంగా తేనే ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో తేనే ఉత్పత్తి 76 వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఏడేళ్లు గడిచే సరికి ఏకంగా 1.25 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. అదే విధంగా విదేశాలకు ఉత్పత్తి చేస్తున్న తేనే 28 వేల మెట్రిక్ టన్నుల నుంచి 60 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు.
తేనె వల్ల అనేక లాభాలున్నాయి. సౌందర్యం పొందేందుకు తేనె కీలకపాత్ర పోషిస్తుంది. తేనె చలువ చేస్తుంది. ఆకలిని పుట్టించి, బలాన్ని పెంచుతుంది. తేనె తీసుకోవడంతో దృష్టి లోపాలు తగ్గుతాయి. చర్మానికి కాంతిని కలిగించి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. గాయాలను మాన్పించడంలో తేనె ఎంతగానో సహకరిస్తుంది. నోటిపూతకు తేనె మంచి ఔషధం . అల్లం రసంతో కలిపి తేనే తాగడంతో దగ్గు తగ్గుతుంది. పుండ్లు , చర్మవ్యాధులు, మొటిమలు , తలనొప్పి, జ్వరము , రక్తహీనత, గుండె జబ్బులు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది . షుగర్ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగితే మంచి ఫలితాలు వస్తాయి.
#honey #NarendraSinghTomar #agriculturelatestnews #eruvaaka