తెలంగాణవార్తలు

Independence 75th Diamond jubli Celebrations in Devarakonda: దేవరకొండ నియోజకవర్గంలోని వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా స్వాత్రంత్య్ర వజ్రోత్సవ వేడుకలు.!

1
Independence 75th Diamond jubli Celebrations
Independence 75th Diamond jubli Celebrations

Independence 75th Diamond jubli Celebrations in Devarakonda: సంక్షేమాన్ని – అభివృద్ధిని నిలకడగా ముందుకు తీసుకెళ్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గం డిండి వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రంలో విత్తనాలు, మొలకలతో 10 రోజులు శ్రమించి ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిత్రాలతో వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించిన విత్తనోత్పత్తి క్షేత్రాన్ని సందర్శించి రూపకర్తలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్ , అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రజలంతా ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం వెనక ప్రజలను సంఘటితం చేసే ప్రయత్నం ఉన్నది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో నూతన తరానికి ఆ స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాల విలువ తెలియాలి. స్వాతంత్ర్యానికి ముందు 150 ఏండ్లు ముందు తరాలు వివిధ మార్గాల్లో, వివిధ రూపాల్లో పోరాటం చేశారు.

ఆంగ్లేయుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు అనేక ఆందోళనలు, సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేపట్టారు. భగత్ సింగ్ పార్లమెంట్ మీద దాడి చేస్తే సుభాష్ చంద్రబోస్ దేశం వెలుపల ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో సైన్యాన్ని తయారు చేశారు. అబిద్ అశ్రాని అనే హైదరాబాద్ వాసి జై హింద్ అనే నినాదం సృష్టించారు.

Independence 75th Diamond jubli Celebrations in Devarakonda

Independence 75th Diamond jubli Celebrations in Devarakonda

స్వాతంత్ర్య పోరాటంలోని త్యాగాలు ప్రస్తుత తరానికి తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ 2 వారాల పాటు వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. రేపటి తరాల భవిష్యత్ కోసం గత చరిత్ర తాలూకు విషయాలను గ్రహించి రేపటికి బాటలు వేయాలి. ఈ మొలకెత్తిన విత్తనాల వెనక నేనున్నా మీకోసం అన్న సందేశం ఉన్నది. రైతుబంధు, రైతుభీమా, కేసీఆర్ అండ ఉన్నదని తెలపడం దీని ఉద్దేశం. సాంకేతికత ఎంత ఎదిగినా మనిషికి కావాల్సిన ఆహారం వ్యవసాయం ద్వారా, భూమి నుండే రావాలి. ప్రపంచంలోని 780 కోట్ల జనాభాకు కావాల్సిన ఆహారం ఏదో ఒక దేశం నుండి ఉత్పత్తి కావాల్సిందే. ప్రపంచ ఆహారపు అవసరాలను తీర్చాల్సిన బాధ్యత రైతాంగం మీద ఉన్నదని తెలంగాణ వ్యవసాయశాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Also Read: Independence Day Diamond Jubilee Celebrations: వినూత్నంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు.!

మారుతున్న ఆహారపు అవసరాలకు అనుగుణంగా రైతులు విభిన్నమైన, వైవిధ్యమైన పంటలు పండించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అత్యాధునిక సాంకేతికత, కొత్త వంగడాలు, సాగు విధానాలను అనుసరించి రైతాంగం పంటల ఉత్పాదకతను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మార్కెట్ డిమాండ్ ను అనుసరించి రైతులు పంటలు పండిస్తే వ్యవసాయం లాభదాయకం అవుతుంది. దానికి భిన్నంగా సాగు విధానాలు ఉన్నందునే పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైతులు పంటలు పండించేలా శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. కేంద్రంలోని ప్రభుత్వానికి ఈ దిశగా చర్యలు తీసుకునే ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. ఆకర్షణీయమైన నినాదాలు తప్ప ఆచరణాత్మక విధానాలు లేవు. అమెరికా తర్వాత మన దేశంలోనే అత్యధిక సాగుభూమి ఉన్నది .. చైనా మన కన్నా తక్కువ సాగుభూమి ఉన్న ఎక్కువ ఉత్పాదకత ఉన్నది. 3.25 కోట్ల ఎకరాలలో దేశంలో పత్తి సాగు అవుతున్నది .. కానీ కేవలం 80 లక్షల ఎకరాలలో అమెరికా పత్తి సాగు చేస్తూ అత్యధిక ఉత్పత్తి చేస్తున్నదని తెలిపారు.

Independence 75th Diamond jubli Celebrations in Devarakonda Constituency

Independence 75th Diamond jubli Celebrations in Devarakonda Constituency

దేశంలో కూలీల కొరత అధిగమించేందుకు మోడీ 2014లో వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం చేస్తామని అన్నారు .. కానీ ఇంత వరకు దాని ఊసెత్తడం లేదు. విదేశాలలో వ్యవసాయ కమతాలు పెద్దవి .. మన దేశంలో వ్యవసాయ కమతాలు చిన్నవి .. వాటికి అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయంలో ఊబరైజేషన్ రావాలని ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే భారత ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి వ్యవసాయ రంగానికి ఉన్నదని నిరంజన్ రెడ్డి గారు అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతు తాను ధైర్యంగా బతకగలమనే ఆత్మవిశ్వాసం వచ్చింది. వరి తర్వాత అత్యధికంగా మినుముల వినియోగం ఉన్నది..కానీ మినుములు సాగు చేయడం లేదు. అనేకమంది రైతులు వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తూ లాభాలు అర్జిస్తున్నారు. పరాన్నభుక్కులను కాదు పని చేసే వారిని, పనిచేసే వారిని గౌరవించే వారిని తయారు చేయాలి. 9 విడతలలో రైతుబంధు పథకం కింద రూ.58 వేల కోట్లు రైతాంగానికి ఇచ్చారు. రైతుభీమా, ఉచిత కరంటు, వ్యవసాయ మౌళిక సదుపాయాల కోసం రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. రైతు కష్టం సమాజ ఉద్దరణ కోసమే. సంక్షేమాన్ని – అభివృద్ధిని నిలకడగా ముందుకు తీసుకెళ్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని నిరంజన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వెల్లడించారు.

Also Read: Storing Fruits and Vegetables: పండ్లు మరియు కూరగాయలు నిల్వ చేయుట గల ప్రాముఖ్యత.!

Leave Your Comments

Storing Fruits and Vegetables: పండ్లు మరియు కూరగాయలు నిల్వ చేయుట గల ప్రాముఖ్యత.!

Previous article

Palle Nidra: వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలి – మంత్రి నిరంజన్ రెడ్డి.!

Next article

You may also like