తెలంగాణవార్తలు

Independence Day Diamond Jubilee Celebrations: వినూత్నంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు.!

1
Independence Day Diamond Jubilee Celebrations in Telangana
Independence Day Diamond Jubilee Celebrations in Telangana

Independence Day Diamond Jubilee Celebrations: భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్య్ర భారత వజ్రోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపుమేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలకు ఘనంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ముగింపు పలికారు. భావి తరాల వారికి స్ఫూర్తి నిచ్చేలా వినూత్న ప్రక్రియలో కొనసాగుతున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

175 అడుగుల పొడవు
105 అడుగుల వెడల్పు మొత్తం
18,375 చదరపు అడుగుల విస్తీర్ణంలో 75వ భారతస్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వ్యవసాయ శాఖా మంత్రి చిత్రాలు ఏర్పరిచారు.

Independence Day Diamond Jubilee Celebrations

Independence Day Diamond Jubilee Celebrations

Also Read: Goat Plague Disease: మేకలలో ప్లేగు వ్యాధి ఎలా వస్తుంది.!

పెసలు, జీలుగు, గోధుమ, వరి, వేరుశనగ, కందులు, జొన్నలు, బియ్యంతో వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బియ్యం, ధాన్యం, జీలుగ విత్తనాలతో కేసీఆర్ గారి చిత్రపటం రూపొందించబడినది. గోధుమలు, జీలుగ విత్తనాలు, బియ్యంతో వ్యవసాయ శాఖా మంత్రి చిత్రపటం వేశారు.

నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ శాఖ విత్తనక్షేత్రంలో 10 రోజులు శ్రమించి విత్తనక్షేత్ర సిబ్బందితో కలిసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి రైతు, తెలంగాణ ఉద్యమకారుడు మందపాటి రవీందర్ రెడ్డి దీనిని రూపొందించారు.

ఈ సందర్భంగా మంగళవారం డిండి వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించి అభినందించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.

Also Read: Threshing: వివిధ పద్ధతుల ద్వారా పంట నూర్పిడి ఎలా చేస్తారు.!

Leave Your Comments

Goat Plague Disease: మేకలలో ప్లేగు వ్యాధి ఎలా వస్తుంది.!

Previous article

Weed Management in Oilseed Crop: నూనె గింజల పంటలో కలుపు యాజమాన్యం.!

Next article

You may also like