వార్తలు

పట్టు పరిశ్రమలకు అందని ప్రోత్సాహక సొమ్ము..

0

పంటల సాగులో కష్టాలను అధిగమించేందుకు ప్రభుత్వం రైతులను పట్టు పరిశ్రమ వైపు మరల్చింది. వివిధ రకాల ప్రోత్సహకాలు అందిస్తోంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మల్బరీ తోట సాగుకు, పట్టుగూళ్ల ఉత్పత్తి షెడ్డుకు రాయితీ ఇస్తోంది. పట్టుగూళ్లను విక్రయించినప్పుడు కిలోకు రూ.75 ప్రోత్సాహకం లభిస్తుంది. పలువురు రైతులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని మల్బరీ తోటలు సాగు చేసి పట్టుమరిశ్రమలను నెలకొల్పారు. అయితే మూడేళ్ళ నుంచి రైతులకు ఇచ్చే ప్రోత్సాహకం ప్రభుత్వం నుంచి రావడం లేదు. ఈఏడాది క్రితం వచ్చిన కరోనా వైరస్, లాక్ డౌన్ కష్టాలతో పట్టు రైతులు అయ్యారు. అష్టకష్టాలు పడుతూ పట్టు గుడ్లను తెప్పించుకుని సాగు చేశారు. వీటి ధర పతనమై ఏడాది పాటు తీవ్రంగా నష్టపోయారు. చాలా చోట్ల మల్బరీ తొలగించడంతో రూ. లక్షలు వెచ్చించి వేసిన షెడ్డు, ఇతరత్రా పరికరాలు, సామాగ్రి పనికిరాకుండా ఉన్నాయి.
రెండేళ్ల క్రితం నిర్మల్ జిల్లాలోనే 300 ఎకరాల్లో 150 మంది రైతులు పట్టుపరిశ్రమలో ఉన్నారు. 50 శాతం కంటే ఎక్కువ మంది రైతులు ఈ పరిశ్రమ నుంచి తప్పుకున్నారు. బైంసా హ్యాంపోలికి చెందిన యువ రైతు వినాయక్ మూడేళ్ళ క్రితం రూ. లక్షల వ్యయంతో 5 ఎకరాల్లో మల్బరీ తోట, రూ. 15 లక్షలతో ర్యాక్ లు, ఇతరత్రా సామాగ్రితో షెడ్ నెలకొల్పారు. సుమారు 20 క్వింటాళ్ల పట్టు గూళ్ళు విక్రయించగా క్వింటా రూ. 7,500 చొప్పున రూ. 1.50 లక్షల ప్రోత్సాహకం రావాలి. కరోనా వైరస్, లాక్ డౌన్ కష్టనష్టాలతో మల్బరీ చెట్లను తొలగించి ఇతర పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు బైంసా డివిజన్ లో పలువురు ఉన్నారు.
మన రైతులు ఉత్పత్తి చేసిన పట్టుగూళ్లను పట్టు పరిశ్రమ నుంచి పొందిన ప్రోత్సాహక కూపను పూర్తి చేసి రాష్ట్రంలో జనగామ,తిరుమలగిరి, ఉట్నూరు మార్కెట్ల లో విక్రయించుకుంటేనే రాయితీ వస్తుంది. సంవత్సరాల తరబడి ప్రోత్సాహక సొమ్ము రాక రైతులు నిరుత్సాహానికి గురై, దీనికి తోడు ధర కోసం మహారాష్ట్ర, కర్ణాటకలోని దూరపు మార్కెట్లకు తరలి వెళ్తున్నారు.

Leave Your Comments

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు, రేపు వానలు..

Previous article

తెలంగాణలో యాసంగి సాగు లక్ష్యం దాటింది..

Next article

You may also like