వార్తలు

అంగారక గ్రహంపై పంటలు..?

0
eruvaaka
eruvaaka

భూమ్మీద మనుషులు నిండిపోతే.. ఎప్పుడో ఒకప్పుడు అంగారకుడి పైకి వెళ్లాల్సిందేనని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇక మనుషులు సరే మరి అక్కడ తినడానికి తిండి ఎలా? అక్కడ పంటలకు ఆస్కారం ఉందా అన్న అనుమానం ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తుంది. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం అంగారకుడిపై పంటలు పండించవచ్చు అంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ హీంజ్ కెచప్ తయారీలో సరికొత్త వెర్షన్‏ను సిద్ధం చేసింది. కెచప్‌ను అంగారక గ్రహంపై ఉన్న మట్టిలో పెరిగిన టమోటాల నుంచి తయారు చేశారు. అంగారక గ్రహంపై మానవులు నివసించడానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. భూమిపై పండించినంత ఈజీగా కాదు అంగారక గ్రహంపై పంటలు పండించడం.

నిజానికి పైన మట్టిలో సేంద్రియ పదార్దాలు లేవట. అదేవిధంగా సూర్యుడి కాంతి కూడా తక్కువేనని చెప్తున్నారు. అయితే అక్కడ ముందు జాగ్రత్తగా గ్రీన్ హౌస్ రెడీ చేశారు. అంటే గ్రీన్ వాతావరణం లాంటిది అక్కడ సృష్టించారు. కాగా అందులో మార్స్ పై ఉన్న మట్టిని ఉపయోగించుకుని టమోటాలను పండిస్తారు. దాన్ని కెచప్ గా మారుస్తారు. అయితే మార్స్ పైన పండించిన టమోటాలతో తయారు చేసిన ఈ కెచప్ సాధారణ వాటి కంటే భిన్నంగా ఉంటుంది. మరోవైపు చంద్రునితో పాటు అంగారక గ్రహం ఉపరితలంపై పంటలు పండించవచ్చని నెదర్లాండ్‌కు చెందిన వేజ్‌నింగెన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. దీనికి సంబంధించిన నివేదిక ఓపెన్‌ అగ్రికల్చర్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

#Heinzketchup #tomatoes #Mars #agriculturelatestnews #eruvaaka

Leave Your Comments

చేపల పెంపకం రైతుకు పద్మశ్రీ…

Previous article

గణనీయంగా పెరిగిన టీ ఉత్పత్తి…

Next article

You may also like