ఆరోగ్యం / జీవన విధానంవార్తలు

వాల్ నట్స్ తినడం వలన కలిగే ప్రయోజనాలు..

0
walnut

నిత్యం వాల్ నట్స్ ను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వాల్ నాట్స్  తో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అయితే నిత్యం వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణాశయం, పేగుల్లో అల్సర్లు రాకుండా ఉంటాయని శాత్రవేత్తలు తేల్చారు.
హెచ్.పైలోరి అనే బాక్టీరియా మనకు అనేక విధాలుగా సోకుతుంది. దీర్ఘకాలికంగా ఈ వ్యాధి బారిన పడితే జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. దీంతోపాటు అల్సర్లు వస్తాయి. అయితే నిత్యం వాల్ నట్స్ ను తినడం వల్ల సదరు బాక్టీరియా నశిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ మేరకు కొరియాలోని సీహెచ్ఏ క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా ఎముకలపై ప్రయోగాలు చేసి పై విషయాన్ని తెలియజేశారు.
కొన్ని ఎముకలకు వారు నిత్యం వాల్ నట్స్ తో కూడిన డైట్ ను ఇచ్చారు. తరువాత పరిశీలించి చూడగా వాల్ నట్స్ ను తీసుకున్న ఎముకల్లో హెచ్.పైలోరి బాక్టీరియా నశించినట్లు గుర్తించారు. సాధారణంగా హెచ్.పైలోరి బాక్టీరియా వల్ల అల్సర్లు వస్తే.. అవి ముదిరితే క్యాన్సర్లకు కూడా దారితీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కనుక నిత్యం వాల్ నట్స్ ను తీసుకోవడం వాళ్ళ అల్సర్లతో పాటు క్యాన్సర్ ల ముప్పు కూడా ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Leave Your Comments

వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు తప్పని కష్టాలు..

Previous article

భారత భూగర్భజలాల్లో 20 శాతం ఆర్సెనిక్..

Next article

You may also like