మొలకల ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. ఎందుకంటే మొలకలు తీసుకోవడం వల్ల కేలరీలు పెరగవు.మొలకల ని కొద్దిగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడం వల్ల తక్కువగా తింటారు. దీనివల్ల బరువు తగ్గుతారు.మొలకల్లో విటమిన్ ఏ,విటమిన్ కె,విటమిన్ సి,వితమిన్ బి,మరియు ఐరన్,పాస్పరస్, మెగ్నీషియం,పొటాషియం,మాంగనీస్,క్యాల్షియం సమృద్దిగా వున్నాయి.అంతేకాకుండా మొలకెత్తిన గింజలు పోషకాలు అధికంగా ఉంటాయి.మొలకల్లో అధిక శాతం మాంసకృత్తులు ఉంటాయి. అందుకే మొలకలు రోజు తీసుకోవడం చాలా మంచిది.మొలకల నుండి లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
మొలకల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది.ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.అంతేకాకుండా ఫ్రీరాడికల్స్ ను అడ్డుకొని జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.పురుషుల్లో వచ్చే బట్టతల ను నివారిస్తుంది.మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.ఇంకా శరీరంలోని మెటబాలిజం ని పెంచడమే కాకుండా,శరీరంలో టాక్సిన్స్ ని తొలగించడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి.
మొలకల్లో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జుట్టు,చర్మం,గోళ్ళు వంటివి ఆరోగ్యంగా పెరుగుతాయి.మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి,మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.మధుమేహం ఉన్న వాళ్ళు మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర స్దాయిలు అదుపు లో ఉంటాయి. టైప్-2 మధుమేహం వున్నా వాళ్లకి గ్లూకోజ్ స్దాయిలను మెరుగుపరుస్తుంది.మొలకల్లో వుండే న్యూట్రియన్స్ ను శరీరానికి ఆద్భుతమైనప్రయోజనాలను అందిస్తాయి.