పల్లేరు ఒక వనమూలిక అని దీనిని గురించి అందరికీ తెలిసినదే. ఈ చెట్టుకు ఎక్కువగా ముళ్ళు ఉంటాయి. ఇది ఎక్కువగా ఇసుక నేలలో పెరుగుతుంది. ఈ మొక్కను వాడడం వల్ల సంబంధితమైన ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. అంతేకాకుండా పాదాలు దురద గా ఉన్నప్పుడు వీటిని వాడటం వల్ల దురద తగ్గుతుంది. అనేక రోగాలను నయం చేయడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది. పల్లేరు మొక్కలు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి . మగవాళ్ళల్లో లైంగిక బలహీనతలను తొలగించడానికి పల్లేరు మొక్క ఉపయోగపడుతుంది. ఎలా అంటే చిటికెడు పల్లేరు కాయల చూర్ణం, ఒక స్పూన్ ఆశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలలో బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి రోజు పడుకోబోయే ముందు తాగాలి. ఇలా తాగడం వల్ల లైంగిక బలహీనతలు తొలగిపోతాయి. ఈ విధంగా కనీసం పదిహేను రోజులు వాడాలి.
- పల్లేరు చెట్టు బెరడును తీసుకోని కాషాయంగా చేసుకోవాలి. ఈ కషాయము రోజు ఉదయం, సాయంకాలం ఒక స్పూన్ మోతాదులో తాగడం వల్ల పిత్త ప్రకోపం వల్ల వచ్ఛే తలనొప్పి తగ్గుతుంది.
- పల్లేరు పువ్వుల ను ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఈ పొడిని మూడు ద్రాక్ష పళ్ళతో కలిపి రోజుకు మూడు సార్లు 15 రోజులు తీసుకోవడం వల్ల ఆయాసం, ఉబ్బసం వంటివి తగ్గుతాయి.
- పల్లేరు మొక్కను కాయలతో సహా తీసుకొచ్చి బాగా దంచి ఒక కప్పు మేకపాలతో కలిపి మూడు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి దంచి ఒక గుడ్డలో వేసి నీళ్లను పిండుకోవాలి. ఈ రసాన్ని తేనెతో కలిపి కొన్ని రోజులు తాగడం వల్ల మగవాళ్ళల్లో సంభోగ శక్తి పెరుగుతుంది.
- పల్లేరు కాయలను, ఆశ్వగంధ వేర్లను సమానముగా తీసుకొని చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో రోజుకు రెండుసార్లు తిని పావు లీటరు పాలు తాగడం వాళ్ళ క్షయ వ్యాధి, దగ్గు వంటి వ్యాధులు తగ్గుతాయి.