ఉసిరిలో యాంటి ఆక్సిడేటివ్, యాంటి వైరల్, యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. రక్త ప్రసరణను మొరుగు పరిచి శరీరంలో అధికంగా వున్నా కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యా ఔషధంలా పనిచేస్తుంది. అదే విధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఎంతో తోడ్పడుతుంది. దీనిని ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోస్తారు. ఇందులో వున్నా శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900మి.లీ.గ్రాముల “సి”విటమిన్, 7.05నీరు, 5.09 శాతం చక్కర పోషకాలున్నాయి. ఉప్పు రుచి తప్పించి మిగిలిన ఐదు రుచులు దీనిలో కలిగి ఉంది. ఆరోగ్యాన్ని సంరక్షిచడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. ఉసిరి కాయలను పచ్చడికి, జాం, జెల్లీ, సాస్ తయారీల్లో కూడా ఉపయోగిస్తారు.
ఉసిరితో ఆరోగ్య లాభాలు:
- ఉసిరి ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు దోహదపడుతుంది. ఇది రక్త హీనతను అధిగమించకుండా ఉండటానికి తోడ్పడుతుంది.
- ఉసిరి లోని” లినోయిక్ యాసిడ్” వల్ల కామెర్లు , సత్వరం, తగ్గటానికి సహాయ పడుతుంది.
- శరీరానికి చల్లధనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగటానికి తోడ్పడుతుంది.
- ఆస్తమా, బ్రాంకైటిస్ , క్షయ, శ్యాసనాలముల వాపు, ఊపిరితిత్తులనుండి రక్తం పడుట మున్నగు వ్యాధులను నయం చేస్తుంది.
- ప్రతి రోజు ఉసిరికాయ తినడం వలన మలబద్దకం తగ్గుమొహం పడుతుంది.
- మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. జ్ఞాపకశక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు.
- కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
- ఉసిరి శరీరానికి మంచి “యాంటి ఆక్సిడెంట్” గా పనిచేస్తుంది.
- లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్రగా పోషిస్తుంది.
- ఉప్పులో ఎండా బెట్టిన ఉసిరిని నిల్వచేసుకొని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ వుంటే , జీర్ణ శక్తి పెరుగుతుంది, అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది. ఎసిడిటి, అల్సర్ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది.
- దీనితో తయారుచేసిన ఆమ్ల మురబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది.
- ఉదర సంబంధ వ్యాధులకి ఎక్కువగా వాడుతారు. దీనితో తయారైన మాత్రలు వాడటం వలన వాంతు, పిత్తు, కఫ్ రోగాలకి ఇది దివ్యా ఔషధంగా పనిచేస్తుంది .
ఉసిరి పండు చూర్ణాన్ని పాలతో కలిపి రోజు తీసుకుంటే కంట స్వరంకి సంబంధమైన సమస్యలు తొలుగుతాయి.