Cotton Farming: గత రెండేళ్లుగా పత్తి ధర కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉంది. పత్తి రైతులు ఆర్ధికంగా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.10 వేల నుంచి 11 వేల వరకు ధర కొనసాగుతోంది. అందువల్ల వచ్చే ఏడాది పత్తి సాగు పరిధి పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. హర్యానా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2022 సీజన్‌లో 19.25 లక్షల ఎకరాల్లో పత్తి విత్తన లక్ష్యాన్ని నిర్దేశించిందని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ సుమితా మిశ్రా తెలిపారు. దీంతోపాటు గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు కార్యాచరణ ప్రణాళికపై ఇప్పటికే శాఖ సమీక్షించిందన్నారు ఆయన.
ఇకపోతే మార్చి 31లోగా రాష్ట్రంలోని అన్ని కాటన్ క్రషింగ్ ఫ్యాక్టరీలు, ఆయిల్ మిల్లులు పాత స్టాక్‌ను శుభ్రం చేయాలని కోరినట్లు డాక్టర్ మిశ్రా తెలిపారు. సిర్సా, ఫతేహాబాద్, హిసార్, భివానీ, జింద్, సోనిపట్, పల్వాల్, గురుగ్రామ్, ఫరీదాబాద్, రెవారీ, చర్కీ దాద్రి, నార్నాల్, ఝజ్జర్, పానిపట్, కైతాల్, రోహ్‌తక్ మరియు మేవాత్ జిల్లాల్లో ప్రధానంగా పత్తిని పండిస్తున్నట్లు అదనపు ప్రధాన కార్యదర్శి తెలిపారు. గత సీజన్‌లో 15.90 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గులాబీ రంగు కాయతొలుచు పురుగు కారణంగా పత్తి పంట దెబ్బతిన్నది. ఈసారి ఖరీఫ్ 2022 సీజన్‌లో 19.25 లక్షల ఎకరాలను వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అవసరాలకు సరిపోయే సుమారు 60 లక్షల బిటి పత్తి విత్తన ప్యాకెట్లను కూడా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిందని తెలిపారు. 2021-22 సంవత్సరానికి పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6025 అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. .
పత్తిలో పింక్ బాల్ వార్మ్ తీవ్రమైన ముప్పును దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ పత్తి పండించే జిల్లాల్లోని 85 శాతం గ్రామాల రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. హిసార్‌లోని చౌదరి చరణ్‌సింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి మరియు మెరుగైన ఉత్పత్తి కోసం పంట సీజన్ అంతటా వివిధ సలహాలను అమలు చేయడానికి వారపు కార్యక్రమం కూడా సిద్ధం చేశారు. దిగుబడిలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు గులాబీ రంగు కాయతొలుచు పురుగుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.