harish rao fires on kishan reddy గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు విషయంలో తెరాస, బీజేపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టంగా చెప్తుంది. యాసంగి వరి ధాన్యం కొనలేమని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ధాన్యం కొనుగోలు చేయాలని, లక్షలాది మంది రైతులు జీవితాలతో ఆడుకోవద్దంటూ, ధాన్యం కొనలేమని చెప్పి రైతులని అవమానించొద్దంటూ తెరాస ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. కాగా.. ధాన్య సేకరణ కోసం సీఎం కేసీఆర్ మహా ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ మహా ధర్నా నిర్వహించారు. అనంతరం అమీతుమీకి సిద్ధమై ఢిల్లీలోనే తేల్చుకుంటానని సీఎం కేసీఆర్, బృదం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ ఇష్యూపై స్పందించారు.
Raw Rice Issue యాసంగిలో రా రైస్ ఎంత మేర ఇచ్చినా కొంటామని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేశారు మంత్రి హరీష్. రెండు రకాల మాటలతో రైతుల్ని మోసం చేయొద్దంటూ, మీ మాటలు, చేతలతో రైతుల్ని అవమాన పరుస్తున్నారని అన్నారు మంత్రి. యాసంగి ధాన్యాన్ని ఉడికించకుండా మరాడిస్తే విరిగిపోయి నూకలు ఎక్కువ వస్తాయి. క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాలి ఉన్నది. యాసంగి ధాన్యాన్ని బియ్యం పట్టిస్తే క్వింటాల్ వడ్లకు 40 కిలోల నూకలు, 27 కిలోల బియ్యం వస్తాయి. బాయిల్డ్ రైస్ అయితే క్వింటాల్ వడ్లకు 68 కిలోలు వస్తాయి. రా రైస్ కొంటామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. నేరుగా మరాడిస్తే నూకలు ఎక్కువగా వస్తే మీరు కొంటరా? కేంద్రంలో గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ బాయిల్డ్‌రైస్ కొన్నాయి. ఇప్పుడు కూడా కొనాలి. వాస్తవాలను దాచిపెట్టి రెచ్చగొట్టే ప్రసంగాలతో మోసం చేస్తున్నది బీజేపీ నేతలు కాదా’అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. Kishan Reddy
ఇక రైతుల బాగు కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని దేశ ద్రోహులుగా కీర్తిస్తారా అంటూ మంత్రి హరీష్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రైతుల కోసం తెరాస ప్రభుత్వం అనేక పధకాలు అమలు చేసింది. కానీ బీజేపీ నాయకులు మాత్రం మమ్మల్ని వ్యతిరేక శక్తులుగా ముద్ర వేస్తుంది ఇది సరైన పద్దతి కాదంటూ సూచించారు హరీష్. మీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.
కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పటంతో 16, 17 శాతం తేమ వచ్చిన తర్వాతే ధాన్యాన్ని మిల్లులకు పంపాల్సి వస్తున్నదని, దీంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. యాసంగిలో ఏ పంట వేయాలోనని రైతులు ఎదురుచూస్తున్నారని, దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌చేశారు. Harish Rao