గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లో ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను సందర్శించి శాస్త్రవేత్తలు, అధికారులను అభినందించి సన్మానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఘనస్వాగతం పలికిన ఇఫ్కో వైస్ చైర్మన్, జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్ సంగానియా గారు, ఇఫ్కో కలోల్ యూనిట్ హెడ్ ఇనాందార్ గారు, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేష్ రాలియా గారు
నానో యూరియా సాధారణ రైతుబిడ్డ విజయం
నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త రమేష్ రాలియాను
అభినందించి, సన్మానించిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు
బయో (నానో) టెక్నాలజీలో ఏడేళ్లు అమెరికాలో పరిశోధనలు చేసి తన జ్ఞానం, తన పరిశోధనా ఫలాలు అత్యధిక మంది రైతులున్న భారతదేశానికి ఉపయో
గపడాలని దేశానికి తిరిగివచ్చి ఇఫ్కోలో చేరి మరో మూడేళ్లు పరిశోధనలు చేసి లిక్విడ్ నానో యూరియాను కనిపెట్టడం గర్వకారణం
500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ ను 127 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే ఎకరాకు సరిపోతుంది
కేవలం రూ.240 కి లభించే ఈ బాటిల్ మూలంగా ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున సబ్సిడీ భారం తప్పుతుంది. ఇఫ్కో భారత రైతాంగ సహకార సంస్థ .. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది .. ఇది మనది కావడం మనకు గర్వకారణం
అటువంటి ఇఫ్కో సంస్థ పరిశోధనల నుండి ప్రపంచ పేటెంట్ కలిగిన నానో యూరియా రావడం దానిని ప్రపంచానికి అందించడం మన దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుంది. ఇది వ్యవసాయంలో ఎరువుల వాడకంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుంది .. భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదే
నానో యూరియాతో భూసారం పెరగడంతో పాటు, పంట దిగుబడి శాతం సాధారణం కన్నా 8 శాతం అధికంగా ఉంటుందన్నది పరిశోధనలలో తేలింది.దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ పెట్టండి . ప్రభుత్వపరంగా భూమితో పాటు ఇతర సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పరిశ్రమల మంత్రి కేటీఆర్ గారి అండతో అన్ని రకాల సహకారాలు అందిస్తాం. దక్షిణ తెలంగాణలో ఏర్పాటు మూలంగా కాశ్మీర్ – కన్యాకుమారి, ముంబయి – విజయవాడ – కోల్ కత రహదారులు అందుబాటులో ఉండడంతో మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లకు అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలి. రైతులు దీనిని విరివిగా వాడేలా ప్రోత్సాహం అందించాలి. గుజరాత్ లోని గాంధీనగర్ కలోల్ ఇఫ్కో యూనిట్ లో రోజుకు లక్షా 50 వేల నానో యూరియా బాటిళ్ల ఉత్పత్తి సామర్ద్యం. రోజుకు 67 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్ధ్యం
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఅర్ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా ఏడేళ్లలో సాగు విస్తృతి గణనీయంగా పెరిగింది .. పంటల దిగుబడి కూడా పెరిగింది. రెండేళ్లుగా పంజాబ్ తర్వాత తెలంగాణ ధాన్యం సేకరణలో దేశంలో రెండోస్థానంలో నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ప్రోత్సహించడంతో సాగులో ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని రైతులను చైతన్యం చేయడం జరుగుతుంది. పెరిగిన సాగు దృష్ట్యా తెలంగాణలో ఇఫ్కో నానో యూరియా ప్లాంటును ఏర్పాటు చేయాలని ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంగానియా గారికి విజ్ఞప్తి .. ఇఫ్కో బోర్డు మీటింగ్ లో చర్చిస్తామని హామీ .ఎరువుల వాడకంలో సాంప్రదాయ పద్దతులతో నష్టపోతున్న రైతాంగాన్ని నానో ఎరువుల వైపు మళ్లించడం మూలంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు మొదలవుతుంది