Depy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఈ పేరు ఒక సంచలనం. రాజకీయాల్లో మొదటి నుండి పవన్ కళ్యాణ్ పందానే వేరు. అతడు ఏది చేసినా ఒక సంచలనమే. జనసేన పార్టీ స్థాపించిన దగ్గరనుండి అధ్యక్షుడిగా అన్ని తానై ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా పార్టీని నడుపుతూ 2024 ఎన్నికలలో కూటమిలో తమ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులందరిని గెలిపించుకొని భారతదేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనం సృష్టించారు. అధికారం చేపట్టిన తరువాత కూడా అదే ట్రెండును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా తన మార్కును కొనసాగిస్తున్నారు. మొదటనుండి అమితమైన దేశభక్తితో మెలిగే వ్యక్తిగా ఉండే పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు కేటాయించే నిధులను ఎప్పుడు లేని విధంగా రూ.100 నుండి 10,000 రూపాయలు 250 రూపాయలు నుండి 25 వేల రూపాయలకు పెంచారు. పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గం అన్న మహాత్మా గాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని 13,326 గ్రామపంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి దేశంలోనే ఒక కొత్త చరిత్రకు నాంది పలికారు. గ్రామ సభలు నిర్వహించటమే కాకుండా పంచాయతీలకు నిధులు విడుదల చేసి రాష్ట్రంలోని నవీన గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పునాదులు వేశారు. ఎన్నికలలో ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీ పాలన అందిస్తామని మాట ఇచ్చాము అన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. అలానే గ్రామ సభల ద్వారా గ్రామ ప్రత్యేకతలను గుర్తించి అక్కడ తయారయ్యే వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేసి సంపదను సృష్టించి గ్రామ ఆర్థిక పటిష్టతకు తోడ్పడుతామని చెప్పారు. ఇంకా పర్యావరణాన్ని రక్షించే అనేక కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నామని, గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనేక మార్గాలను అన్వేషించి వాటికి తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు.
పంచాయు రాజ్ వ్యవస్థ మూడంచెల వ్యవస్థ ….
1. గ్రామ పంచాయతీ
2. మండల పంచాయతీ
3. జిల్లా పంచాయతీ
భారత దేశంలో గ్రామ పాలన ప్రాచీనకాలం నుండిచి బ్రిటీష్ పాలన కంటే ముందు వరకూ నిరాటంకంగా కొనసాగింది. దీనికి వేదకాలం, మౌర్యులు, చోళుల పాలన కాలాలను ఉదాహరణగా చెప్పవచ్చు. భారతదేశంలోని స్వయం సంవృద్ధి గ్రామీణ వ్యవస్థను నాశనం చేయకుండా, తమ అధికారాన్ని సుస్థిరం చేయటం సాధ్యం కాదని భావించిన బ్రిటీష్ ప్రభుత్వం వారి ఆర్థిక, విద్యా విధానాల ద్వారా పథకం ప్రకారం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
స్వాతంత్రానంతరం గ్రామీణాభివృద్దే లక్ష్యంగా అనేక ప్రయత్నాలు జరిగాయి. సమగ్ర గ్రామీణాభివృద్దే లక్ష్యంగా, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం చేయాటానికి ప్రజలను భాగస్వాములను చేయటానికి అవసరమైన సలహాలను, సూచనలను చేయటానికి 1957లో బలవంత్ రాయ్ మెహతా కమీటి ఏర్పాటు చేశారు.
1993 తర్వాత స్థానిక సంస్థలకు 73 వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ద్వారా రాజ్యాంగ హోదా లభించింది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొంది ఏప్రిల్ 24, 1993 నుండి అమలులోకి వచ్చింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆవిధంగా 73 వ రాజ్యాంగ సవరణ చట్టం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య భాగస్వామ్య ప్రజాస్వామంగా ఆచారానికి తేవడానికి అవకాశం కల్పించాలి. పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు, ఉనికి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై కాకుండా రాజ్యాంగబద్ధ సంస్థలుగా రూపాంతరం చెందడానికి తోడ్పడిరది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఒకే విధమైన నిర్మాణంలో పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల రాజ్యాంగ బద్దమై భాద్యతయింది.
రాజ్యాంగంలోని 1శ భాగంలో పంచాయతీలు పేరుతో 243 నుంచి 243(0) వరుకు 16 నిబంధనలను ప్రస్తావించారు. దీనితోపాటు రాజ్యాంగానికి శ1 వ షెడ్యుల్‌ను ఏర్పరచి, అందులో 243 (G) ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలు నిర్వహించాల్సిన అధికారాలు, భాధ్యతలను తెలిపే 29 అంశాల పేర్కొన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధికి, గ్రామీణ పేదరిక నిర్మూలనుకు సంబంధించిన ఈ 29 అంశాలను నిర్వహించటానికి కావలసిన నిధులను కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు సమకూర్చాలి.
15వ ఆర్థిక సంఘం 2021-22, 2025-26న దేశంలో స్థానిక సంస్థలకు / గ్రామ పంచాయతీలకు 4,36,361 కోట్లు సమకూర్చినది. ఈ గ్రాంట్స్ వినియోగం గ్రామ పంచాయతీల బాధ్యత. ఇంతటి ప్రాధాన్యత కలిగిన గ్రామా పంచాయతీ వ్యవస్థను అధికారం ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన గ్రామీణాభివృద్ధి కుంటుపడిరది. ఈ నేపథ్యంలో క్రొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను పునర్జీవం చేసి బలోపేతం చేయటానిక గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించటం దేశంలోనే ఒక చర్చకు, పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆవశ్యకతను తెలియచేయడంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: PJTSAU: భారీ వర్షాల నేపథ్యంలో వివిధ పంటల సంరక్షణ-సూచనలు
గ్రామసభలు – వాటి పాత్ర :
పంచాయతీరాజ్ స్వవస్థను బలోపేతం చేయడానికి ‘‘గ్రామ సభల’’ నిర్వహణ అత్యంత కీలకమైనది. రాజకీయాలకు అతీతంగా, క్రమబద్దంగా గ్రామసభలను నిర్వహించాలి. గ్రామ సభల నిర్వహణ నామమాత్రంగా కాదు. ఒక ప్రణాళిక బద్దంగా చట్టబద్దంగా జరగాలి. గ్రామసభలు సర్పంచ్ లేదా పార్టీ కేంద్రీకృతంగా జరగకుండా గ్రామస్తుల భాగస్వామ్యం పెరిగి సాత్విక స్వపరిపాలన కేంద్రముగా జరగాలి. గ్రామసభల నిర్వహణకు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. అన్ని గ్రామసభ నిర్వహణకు ఒక స్పష్టమైన ఎజెండా ఉండాలి, గ్రామసభ నిర్వహణను కనీసం ఒక వారము ముందుగా తెలియజేయాలి. గ్రామస్థుల కూర్చటానికి ఏర్పాటుచేయాలి. అన్ని ప్రభుత్వశాఖల ప్రతినిదులు హజరు అవ్వాలి, సర్పంచ్, వార్డ్ మెంబర్లు హాజరవ్వాలి, ఎజెండా అంశాలపై చర్చ జరగాలి మరియు తీర్మానాలు – గ్రామసభ మినిట్స్ తయారు చేయాలి, ఎక్షన్ టేకేవ్ రిపోర్ట్ తయారు చేయాలి. గ్రామసభలో పొదుపు సంఘాలు, ఎఫ్.పి.ఓలు పాఠశాల కమీటి, అంగన్వాడీ, వికలాంగులు, వృద్ధాలు, యువత అందరూ పొల్గొనేటట్లు చేయాలి. గ్రామసభలో దళితిలకు, ఆదివాసీలకు, మహిళలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కులాలు, మతాలు, వర్గాల ఆధిపత్య ధోరణి లేకుండా సహృద్భావ వాతావరణంలో జరిగే విధంగా చూడాలి.అవసరమైన చోట పోలీస్ రక్షణ ఏర్పాటు చేయాలి.
ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో గిరిజన గ్రామాలు, రాయలసీమ ప్రాంతములో కొన్ని చోట్ల గ్రామపంచాయతి పరిధిలో అనేక చిన్న, చిన్న కుగ్రామాలు కూడా ఉన్నాయి. గ్రామసభ జరిగే చోటుకు గ్రామపంచాయతీలోని అన్ని చిన్న గ్రామాల నుండి గ్రామస్థులను రప్పించాలి. అవసరమైతే వారికి రవాణా సదుపాయం కల్పించాలి. అంతేగాని చిన్న గ్రామాలని విస్మరించరాదు.
కొన్ని అతిముఖ్యమైన అంశాలు …
1) అటవి హక్కుల పరిరక్షణ చట్టం
2) గనుల యాజమాన్యం
3) పునరావాసం నష్ట పరిహారం
4) ఆదివాసీల హక్కులు
5) సామాజిక వనాలు
6) సామాజిక భూములు
7) చెరువులు, కుంటలు, వాగుల పరిరక్షణ
8) చాకిరేవులు
9) శ్మశాన వాటికలు
10) తాగునీటి వనరులు
11) పేదప్రజల గృహ, జీవనోపాది
12) వ్యవసాయ, సాగునీటి అంశాలు
అదే విధంగా కేంద్రప్రభుత్వ కార్యక్రమాలైన ‘జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాల అమలు, పురోగతి మీద సమీక్ష జరగాలి. వాటి ప్రణాకలను జిపిడిపి ప్లాన్ పొందుపరచాలి. మరియు జీపీడీపీ గ్రామ పంచాయతీ డెవలప్ మెంట్ ప్లాన్ మరియు గ్రామ ప్రణాళికలో పొందుపరచాలి.
గ్రామసభ అనేది ఒక ‘‘సహకార’’ సంఘం అనే భావనతో పెత్తందారీ వ్యవస్థ నుండి సహకార, సహభాగస్వామ్య, సుపరిపాలనా వ్యవస్థగా నిర్మణం జరగాలి. ఇది గ్రామసభల ద్వారా సాధించవచ్చు. సమర్థవంతమైన గ్రామసభలను నిర్వహించటం ద్వారా మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ‘‘హివారే బజార్’’ పంచాయతీ దేశంలోనే విశేష ప్రగతి సాధించి ఆదర్మ గ్రామముగా పేరుగాంచింది. ‘‘హివారే బజార్’’ గ్రామం పాటిస్తున్న గ్రామాభివృద్ధి కార్యక్రమాలను మనరాష్ట్రంలోని గ్రామాలు కూడా పాటిస్తే ఎంతో అభివృద్ధి సాధ్యపడతుంది.
గత కొన్ని దశాబ్ధాలుగా విపరీత రాజకీయ ధోరణివల్ల కానీ మరేతర సామాజిక అంశాల వల్ల గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను అశ్రద్ధచేయటం జరుగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధి గ్రామసభల ద్వారా సాధించవచ్చనే ప్రయోగాత్మక ప్రయత్నం రాష్ట్రంలో పెను మార్పాలకు కారణమై, గ్రామీణ పేదరిక నిర్మూలను, వసతులు మెరుగు పరుచుటకు, జీవనోపాది కల్పనకు తద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనకు దార్శనికుడైన పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో వారి నేతృత్వంలో బీజం పడిరదని అందరూ భావిస్తున్నారు. ఈ గ్రామసభలను ప్రతి ఒక్కరూ అత్యంత కీలకంగా పరిగణించి ఈ యొక్క ప్రయత్నంలో భాగస్వామ్యులవుతారని ఆశిస్తున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం కూడా కావలసిన నిధులను కేటాయించి వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆశిస్తున్నాము.
రాఘవరావు గారా, 98491 06633
శ్రీనివాస్ చేకూరి,
గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు
Also Read: Minister Atchannaidu: పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు