రెండు కీలకమైన వ్యవసాయ బిల్లులు భవిష్యత్తుపై రాజకీయ మందగమనం కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో కీలకమైన వ్యవసాయ వస్తువుల కొనుగోళ్లను వేగవంతం చేసింది. పత్తి కొనుగోలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కిందా రూ.17,408.85 కోట్ల కమిటెడ్ ప్రైస్ సపోర్టును ప్రభుత్వం ఆమోదించింది. అందులో భాగంగా 2014-15 నుండి 2020-21 వరకు ఏడు పత్తి సీజన్‌లు వర్తిస్తాయి. అదేవిధంగా పత్తి సీజన్ అయినా అక్టోబర్-సెప్టెంబర్ 201లో పత్తి కోసం MSP కార్యకలాపాల కింద నష్టాలను తిరిగి చెల్లించడానికి CCEA ఆమోదించింది. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, 2014-15 నుండి 2020-21 మధ్యకాలంలో పత్తి ధరలు MSP ధరలను తాకడంతో CCI పెద్ద మొత్తంలో పత్తిని కొనుగోలు చేసిందని ఈ మేరకు 2019-20లో 123 లక్షల పత్తి బేళ్లను మరియు 2020-21లో 100 లక్షల బేళ్లను కొనుగోలు చేశాయని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
రైతులు పత్తి పంట సాగు వైపే మొగ్గు చూపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు అధికారులు కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోనున్నారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పత్తిలో 8 నుంచి 12 శాతం వరకు మాత్రమే తేమ ఉండాలి. 12 శాతం కంటే తేమ ఎక్కువ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయరు. తేమ 8శాతం ఎక్కువ ఉన్నట్లయితే ప్రతి ఒక్క శాతానికి రూ.58.25 చొప్పున ధరను తగ్గించి చెల్లిస్తారు. పత్తిపై ఎటువంటి నీరు చల్లరాదు. నీళ్లు చల్లడం వల్ల తేమ శాతం పెరిగి పత్తి రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది. సీసీఐ పత్తికి తీసుకు వచ్చే రైతులు ఒరిజినల్ రైతు గుర్తింపుకార్డు, ఆధార్ కార్డు, పట్టాదారు పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్ తీసుకు రావాలి. సంబంధిత ఏవో ద్వారా టోకెన్లు పొంది అందులో తెలిపిన తేదీలో మాత్రమే కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకురావాలి. టోకెన్లు లేకపోతే పత్తిని కొనుగోలు కేంద్రంలోకి అనుమతించరు.
#Govtapproves #CCI #cottonpurchase #agriculture #eruvaaka