PM Kisan Scheme: పీఎం కిసాన్ యోజన 11వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జరీ చేసింది. జారీ చేసిన మార్గదర్శకాలలోఆదాయపు పన్ను కిందకు వచ్చిన చాలా మంది రైతులు ఈ పథకం కిందా ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. ఈ స్కీమ్ కేవలం చిన్న, సన్న కారు రైతులకి మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొంత మంది రైతులు అనర్హత కలిగినప్పటికీ ఈ స్కీమ్ కింద ప్రతి వాయిదాల్లో డబ్బులు పొందుతున్నారని తెలిపింది. ఈ తరుణంలో యూపీ ప్రభుత్వం 2500 మందికి పైగా రైతులకు డబ్బు రికవరీ కోసం నోటీసు పంపింది. ఈ పథకానికి కొందరు అనర్హులు లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందిన అనర్హుల పట్ల యుపిలోని వ్యవసాయ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఈ పథకం కింద రైతులకు ఇచ్చే మొత్తాన్ని కూడా ఈ వ్యక్తులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ అనర్హుల్లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, భూమిలేనివారు మరియు మరణించినవారు ఉన్నారు.
రొటీన్ వెరిఫికేషన్ సమయంలో బహిర్గతం అయిన తర్వాత డిపార్ట్‌మెంట్ 2700 మందికి పైగా అనర్హులకు నోటీసులు జారీ చేయడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. మృతుల బంధువుల నుంచి వ్యవసాయ శాఖ రూ.6 లక్షలకు పైగా రికవరీ చేసింది.హర్దోయ్ జిల్లాలో దాదాపు 759541 మంది రైతులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు, దీనికి సంబంధించి రైతుల ఖాతాకు PM కిసాన్ యోజన యొక్క తదుపరి విడతను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్న వారికి సంబంధించిన డేటా ప్రభుత్వానికి పంపబడింది.
106 మంది మృతుల కుటుంబాల నుంచి డబ్బు రికవరీ చేశారు
మే, జూన్ నెలల్లో వెరిఫికేషన్ పనులు పూర్తి చేస్తామని డిప్యూటీ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ నంద్ కిషోర్ తెలిపారు. ఇప్పటి వరకు 2707 మంది అనర్హులుగా గుర్తించారు, వీరిలో ఎక్కువ మంది ఆదాయపు పన్ను చెల్లించేవారు కాగా మరికొందరు భూమి లేనివారు. అదే సమయంలో ఒకే కుటుంబానికి చెందిన చాలా మంది పథకం ప్రయోజనం పొందుతున్నారు. అంతే కాదు మృతుల ఖాతాలకు కూడా డబ్బులు చేరాయి. అందుకే పథకానికి అనర్హులుగా చనిపోయిన 106 మంది కుటుంబాల నుంచి రూ.6 లక్షల 26 వేలు వ్యవసాయ శాఖ రికవరీ చేసింది. మిగిలిన అనర్హులకు వీలైనంత త్వరగా తిరిగి చెల్లించాలని వ్యవసాయ శాఖ నోటీసులు జారీ చేసింది. పిఎం కిసాన్ యోజన కింద తీసుకున్న మొత్తాన్ని అనర్హులందరి నుండి రికవరీ చేస్తామని వ్యవసాయ శాఖ పేర్కొంది. జూన్‌లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే ఇంకా చాలా మంది అనర్హులను గుర్తించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.