ఆంధ్రప్రదేశ్వార్తలు

ఆంధ్రా రైతుల‌కు శుభ‌వార్త‌.. అన్నదాత సుఖీభవ పై కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

0
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతుల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్
అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్డేట్
పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన
బడ్జెట్‌లో  4,500 కోట్ల నిధులు కేటాయించామన్న మంత్రి
దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రైతుల కోసం అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కంపై కీల‌క ప్ర‌క‌ట‌ణ చేసింది.
ఆంధ్రా రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20వేలు అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ క్ర‌మంలో ప్రతి ఏటా అర్హులైన రైతులందరికి 20 వేలు అందజేస్తామని.. ఇందులో పీఎం కిసాన్ ప‌థ‌కం ద్వారా వ‌చ్చే 6 వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో 14 వేలు కలిపి ఇస్తామని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామన్నారు.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయింక‌చామ‌న్నారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి, వీలైనంత త్వరలో  రైతుల అకౌంట్‌లలో 20వేలు జమ చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
రైతుల‌కు 20వేలతో పాటుగా వ్వయసాయంలో యంత్రీకరణ, భూసార పరీక్షలు, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నామ‌న్నారు. ఇక కౌలు రైతుల చట్టంలో మార్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దీనిపై రైతుల సంఘాలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 9.8 లక్షల మందికి కౌలు రైతు కార్డులు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియ‌జేశారు.
పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీరు ఉన్నారా..?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో మీరు ఉన్నారో లేరో ఓసారి చెక్ చేసుకోవడం మంచిదంటున్నారు వ్య‌వ‌సాయశాఖ అధికారులు. అందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి.
ఆ తర్వాత బెనిఫీషియరీ స్టేటస్ పేజీలోకి వెళ్ళి,బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్‌పై లబ్ధిదారుల స్టేటస్ కనిపిస్తుంది. సాధారణంగా పీఎం కిసాన్ వెబ్‌సైట్ హోమ్ పేజీలోనే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఇ-కేవైసీ అప్డేట్, కొత్త రైతుల రిజిస్ట్రేషన్, కేవైసీ స్టేటస్, మొబైల్ నంబర్ అప్డేట్, వాలెంటరీ సరెండర్, బెనిపిషియరీ లిస్ట్ అని ఉంటాయి. బెనిఫిషియరీ లిస్ట్‌పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. ఇలా ఒక‌సారి చెక్ చేసుకొని పిఎం కిసాన్ ప‌థ‌కం, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవవచ్చు.
Leave Your Comments

రైతు సమస్యలపై తుమ్మలతో చర్చించిన కోదండరెడ్డి

Previous article

తెలంగాణ సాగు విధానాల‌పై క‌న్నేసిన అగ్ర‌రాజ్యం

Next article

You may also like