వ్యవసాయం , ఉద్యాన పంటల్లో నీటి ఉత్పాదకతను పెంచడానికి అనుసరించ వలసిన నవకల్పనలు “ అన్న అంశం పై నాలుగు రోజుల పాటు గ్లోబల్ కాన్ఫరెన్స్ హైబ్రీడ్ విధానంలో నేడు రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. పిజెటిఎస్ఏయు, కాన్ఫెడరేషన్ ఆఫ్ హార్టికల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు (సిహెచ్ఏఐ) దీన్ని నిర్వహించాయి. ప్రారంభ సదస్సులో వర్సిటీ ఉపకులపతి డా. వి. ప్రవీణ్ రావు (Dr. Praveen Rao), సిహెచ్ఏఐ చైర్మన్ డాక్టర్ హెచ్ పి.సింగ్ (Dr. HP. Singh),భారత ప్రభుత్వ మాజీ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్.కె పట్నాయక్ (S.K Patnayak)లు ప్రసగించారు.
కిందటి ఏడాది జరగాల్సిన ఈ సదస్సు కోవిడ్ కారణంగా రెండు సార్లు వాయిదా పడిందని ప్రవీణ్ రావు అన్నారు. నీటి సమర్ద యాజమాన్యం గురించి , తృణ ధాన్యాలు, నూనె గింజలు ఉత్పత్తి, ఉత్పదాకతల పెంపుదల గురించి దేశంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న సమయం లో ఈ సదస్సు నిర్వహించడం మంచి పరిణామమని ప్రవీణ్రావు అన్నారు. 2014 లో తెలంగాణ ఏర్పాటైన తరువాత ప్రభుత్వం సాగు నీటి సౌకర్యం పెద్ద ఎత్తున కల్పిస్తోంది అన్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తరువాత ప్రభుత్వం సాగు నీటి సౌకర్యం పెద్ద ఎత్తున కల్పిస్తోంది అన్నారు. దాని కారణంగా వ్యవసాయ , హార్టికల్చర్ పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వివరించారు. అయితే నూనే గింజల ఉత్పత్తిలో ఇంకా వెనుకబడే ఉన్నామన్నారు. వాతావరణ మార్పులు, నీటి సమర్ధ యాజమాన్యం, పంటల వైవిధ్యం వ్యవసాయ యాంత్రీకరణ, ఎరువుల సరైన వినియోగం తదితరాలు నేడు మన ముందున్న ప్రధాన సవాళ్ళని ప్రవీణ్రావు అన్నారు.
భారతదేశం అతి త్వరలోనే నీటి సంక్షోభాన్ని ఎదుర్కునే ప్రమాదం ఉందని హెచ్ పి. సింగ్ (H.P Singh) ఆందోళన వ్యక్తం చేసారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సంక్షోభం తప్పదన్నారు . పెరుగుతున్న జనాభా కారణంగా రోజు రోజుకి నీటి లభ్యత, తలసరి నీటి వినియోగం తగ్గుతున్నయన్నారు. ఈ అంశం పై అందరూ తీవ్రంగా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు.
వర్సిటీని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఉపకులపతి ప్రవీణ్ రావు బాగా కృషి చేస్తున్నారని పట్నాయక్ అభినందించారు. తెలంగాణ వ్యవసాయరంగంలో అభివృద్ది పధం లో సాగుతుండటంతో పి జె టి ఎస్ యు కూడా కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తి , ఉత్పాదకత విషయంలో నీటిది కీలక పాత్ర అన్నారు. రోజు రోజుకి నీటి అవసరాలు పెరుగుతున్నందున నీటి సమర్ధ యాజమాన్యం అత్యంత ఆవశ్యక విషయమని పట్నాయక్ అన్నారు.
ఈ సందర్భంగా ఎఎస్ఎం ఫౌండేషన్ వివిధ అవార్డ్ లు ప్రకటించింది. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు గత కొన్నాళ్లుగా వ్యవసాయ రంగానికి, మైక్రో ఇరిగేషన్ లోను చేస్తున్న కృషికి గుర్తింపుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమం లో జాతీయ స్థాయి వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్ర వేత్తలు, ప్రతినిధులు, విద్యార్దిని,విద్యార్ధులు పాల్గొన్నారు. పలువురికి అవార్డులు అందజేసారు.