వార్తలు

తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ రంగంలో యువతకు ఉచిత శిక్షణ

0

తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పట్టణ యువతకు హెచ్ ఎం డి ఏ పరిధిలో పట్టణ హార్టికల్చర్ రంగంలో ల్యాండ్ స్కెప్ వర్క్స్, కినెస్ గార్డెన్ సాగు వంటి నైపుణ్యం కలిగిన పద్ధతులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీస విద్యార్హత రాయడం, చదవడం రావాలి. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాలలోపు యువతీ యువకులకు 15 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. హైదరాబాద్ లోని రెడ్ హిల్స్లో ఉన్న తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Leave Your Comments

రానున్న మూడు రోజుల్లో వర్షాలు..

Previous article

అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like