జాతీయంవార్తలు

Focus On Organic Farming: సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టండి- ఉప రాష్ట్రపతి

3
Focus on Organic Farming
Focus on Organic Farming

Focus On Organic Farming: మట్టి సారాన్ని మానవ జాతి మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అని ఉప రాష్ట్రపతి వెంక‌య్య నాయుడు ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఉన్న కాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యడం ఎంతో ముఖ్యమని అని ఆయన చెప్పారు. వ్యవసాయంలో దిగుబడి ఎంత ముఖ్యమో, ప్రకృతి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని కొనియాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవటమే గాక, ఖర్చులను అదుపు చేసుకుని, స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు అని ఉత్తమ సలహా ఇచ్చారు. రైతులందరూ కృషి చేసి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి సారించాలని అన్నారు.

Focus on Organic Farming

Focus on Organic Farming

Also Read: Organic Farmer Story: సేంద్రీయ వ్యవసాయం ద్వారా 3 లక్షలు సంపాదిస్తున్న రైతు

ప్రస్తుతం రైతులు ప్రకృతి వ్యవసాయానికి కావలసిన ద్రావకాలు, బయోఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు . పశు సంపదను పెంచుకోవడం ద్వారా వ్యవసాయానికి కావలసిన ఎరువులు ఉచితంగా లభించడమే గాక, రైతులకు అదనపు ఆదాయ మార్గంగానూ మారుతుందని రైతులకు మార్గదర్శకం చేశారు.

ప్రకృతి వ్యవసాయం విషయంలో రైతులు చేస్తున్న కృషికి ప్రభుత్వ సహకారం, మీడియా ప్రచారం, ప్రజల ప్రోత్సాహం ఇలా ప్రతి ఒక్కరి తోడ్పాటు రైతులకి కల్పించాలని చెప్పారు. పార్లమెంట్, పార్టీలు, ప్రణాళికా సంఘాలు, నీతి ఆయోగ్, పత్రికలు, ప్రసార మాధ్యమాలు అన్నీ వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Also Read: Organic Farming: ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా రూ.18 లక్షలు సంపాదన

Leave Your Comments

Maize Cultivation: మొక్కజొన్న సాగులో జాగ్రత్త వహించవలసిన అంశాలు

Previous article

Eruvaka Purnima: ఏరువాక పూర్ణిమ విశిష్టత ఏంటో తెలుసా.!

Next article

You may also like