తెలంగాణవార్తలు

Sustainable Soil Health Conservation: పిజె టిఎస్ ఎయూ లో సుస్థిర భూసార ఆరోగ్య పరిరక్షణకు ఫర్టిగేషన్ విధానం

2
Sustainable Soil Health Conservation Program in PJTSAU
Sustainable Soil Health Conservation Program in PJTSAU

Sustainable Soil Health Conservation: ప్రెసిషన్ ఫార్మింగ్ చేపట్టడం వల్ల రసాయనిక ఎరువుల సమర్థ వినియోగం జరుగుతోందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అన్నారు. రాజేంద్రనగర్ లోని నీటి సాంకేతిక పరిజ్ఞానం కేంద్రంలో “సుస్థిర భూసార ఆరోగ్య పరిరక్షణకు ఫర్టిగేషన్ విధానం” అన్న అంశంపై ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, PJTSAU ఏర్పాటు చేసిన ఒక్క రోజు శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల మార్పిడి ద్వారా కూడా రసాయనిక ఎరువులని సమర్థవంతంగా వినియోగించవచ్చని అన్నారు.

PJTSAU

PJTSAU

Also Read: PJTSAU: ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి ప్రారంభించిన PJTSAU ఉపకులపతి.!

ఫర్టిగేషన్ విధానం వల్ల పంటల విధానం, పంటలు వివిధ దశలలో ఉన్నప్పుడు అవసరమైన మేరకు మాత్రమే రసాయనిక ఎరువులని సరైన మోతాదులో వాడేందుకు అవకాశం వుంటుందన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వ్యవసాయ రంగంలో నవ కల్పనలతో రైతులకు మేలైన సేవలు అందించడానికి కృషి చేయాలని సూచించారు.

Sustainable Soil Health Conservation Program in PJTSAU

Sustainable Soil Health Conservation Program in PJTSAU

ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దక్షిణ ప్రాంతీయ విభాగం హెడ్ వై వి ఎన్. మూర్తి, కోరమండల్ ఫర్టిలైజర్స్ వైస్ ప్రెసిడెంట్ జి.వి. సుబ్బారెడ్డి, పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.

Also Read: PJTSAU: పిజె టిఎస్ ఎయూ లో ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ నోడల్ అధికారుల 7వ సదస్సు.!

Leave Your Comments

Mango Plant Protection: మామిడిలో సమగ్ర సస్యరక్షణ.!

Previous article

Precautions for Bringing Baby Chicks Home: కోడి పిల్లలు తెచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Next article

You may also like