జాతీయంవార్తలు

Farmers Suicide: బ్యాంకు రుణాలు తీర్చలేక గోధుమ రైతులు ఆత్మహత్యలు

0
Farmers Suicides
Farmers Suicides

Farmers Suicide: పంజాబ్‌లో గోధుమ దిగుబడి తగ్గుతోంది. వేడి కారణంగా తృణధాన్యాల ఉత్పత్తి తగ్గింది. గోధుమలు కాకుండా, పత్తి పంట దెబ్బతినడం వల్ల రైతులు రెట్టింపు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక రైతులు వ్యవసాయం కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని మరింత కష్టాలు ఎదుర్కొంటున్నారు. సరైన సాగు లేకపోవడంతో రుణం తీర్చలేకపోతున్నారు.దీంతో పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా రైతుల ఆత్మహత్యలు వెలుగు చూస్తున్నాయి.ఇది చాలా ఆందోళన కలిగించే అంశం కూడా. రాష్ట్రంలో నిత్యం ఆత్మహత్యలు జరుగుతున్నాయని వ్యవసాయ సంఘం రైతులు పేర్కొన్నారు.

Farmers Suicides

Farmers Suicides

ఇటీవల తక్కువ గోధుమ దిగుబడితో విసుగు చెందిన 40 ఏళ్ల రైతు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏప్రిల్‌లో పంజాబ్‌లోనే మాల్వా ప్రాంతానికి చెందిన 11 మంది సహా 14 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మంజీత్‌కు చిన్న భూమి ఉంది. వ్యవసాయం కోసం 18 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయం కోసం బ్యాంకుల్లో రూ.17 లక్షల రుణం తీసుకున్నాడు. బ్యాంకులకు రూ.17 లక్షలు బకాయిపడ్డాడు.

Also Read: రెండు నెలల పాటు పంటని సురక్షితంగా ఉంచే కూల్ చాంబర్

మంజీత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంజిత్ ఆత్మహత్య తర్వాత, అతని సోదరుడు సరబ్జిత్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన నష్టపరిహారాన్ని డిమాండ్ చేశాడు. భారతీయ కిసాన్ యూనియన్ ఇచ్చిన డేటా ప్రకారం పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 14 మంది రైతులు మరణించారు, అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైతు రణధీర్ సింగ్ ఏప్రిల్ 21న గ్రామ చెరువులో శవమై కనిపించాడు. అది కూడా గోధుమ దిగుబడి తక్కువగా ఉండడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు.

అంతకుముందు ఏప్రిల్ 20 న బటిండాలోని మైసర్ఖానా గ్రామానికి చెందిన రైతు జస్పాల్ సింగ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.9 లక్షల అప్పు తీర్చలేక ఇంత నిర్ణయం తీసుకున్నాడు. అతని కుటుంబం ప్రైవేట్ బ్యాంక్ నుండి ఋణం తీసుకుంది. అదే రోజు భటిండాలోని మాన్సా ఖుర్ద్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల గురుదీప్ సింగ్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి రెండెకరాల భూమి ఉండగా, ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. గురుదీప్‌కు దాదాపు రూ.3.25 లక్షల అప్పు ఉంది. ఏప్రిల్ 18న అదే జిల్లాలోని బజక్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల రమణదీప్ సింగ్ చికిత్స పొందుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. రమణదీప్ తక్కువ గోధుమ దిగుబడి కారణంగా మానసిక ఒత్తిడికి లోనయ్యాడు మరియు ఏప్రిల్ 14 న పురుగుల మందు సేవించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: మట్టి కుండలో 6 నెలలు పాటు పండ్లు తాజాగా

Leave Your Comments

Moong dal health benefits: పెసర పప్పు తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Watermelon Farmers: అకాల వర్షాలతో పుచ్చకాయ వ్యాపారులకు తీవ్ర నష్టం

Next article

You may also like