వార్తలు

సరిహద్దులను ఖాళీ చేసిన రైతులు

0
Farmers Going Back Home

Farmers Going Back Home

Farmers Going Back Home After Ending 15 Months కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దాంతో కేంద్రం ప్రభుత్వం చర్యకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. సాగు చట్టాలను రద్దు చేయాలని 40 రైతు సంఘాలతో వేలాది మంది రోడ్డెక్కారు. రైతుల ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో మూడు సాగు చట్టాలను రద్దు చేసి బిల్ పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపుగా 15 నెలలు అలుపెరగని ఉద్యమం చేసిన రైతులు ఎట్టకేలకు నిష్క్రమించారు. ఈ మేరకు ఘాజిపూర్‌, సింఘూ, టిక్రి బోర్డ‌ర్లను విడిచి, సింఘూ బోర్డ‌ర్‌ వ‌ద్ద వేసిన టెంట్ల‌ను తీసివేసి త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్తున్నారు. విజయోత్సవంతో ర్యాలీలు చేసుకుంటూ ఇళ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.

Farmers Going Back Home

3 Farm Laws కాగా.. మూడు సాగు చట్టాలను రద్దు చేయగా ఉద్యమం ఆగుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. మిగిలిన డిమాండ్లను నెరవేరిస్తేనే ఉద్యమం ఆపుతామని తెగేసి చెప్పారు. ఉద్యమంలో భాగంగా మరణించిన 750 మంది కుటుంబాలకు నష్టపరిహారం, కనీస మద్దతు ధర తదితర డిమాండ్లకు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే ఉద్యమం ఆపుతామని స్పష్టం చేశారు. కాగా ఇటీవల కేంద్రంతో సంయుక్త కిసాన్ మోర్చా పలు మార్లు చర్చలు జరిపింది. ఫలితంగా రైతుల డిమాండ్లపై కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. Farmers Going Back Home

Farmers Going Back Home

Delhi Protest News మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. దీంతో ఉద్యమానికి చరమగీతం పడేందుకు నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా నేడు ఢిల్లీ సరిహద్దులో వేసిన గుడారాలు, టెంట్లను తొలగించారు రైతులు. ఘాజిపూర్‌, సింఘూ, టిక్రి బోర్డ‌ర్లను విడిచి విజయోత్సవంతో ర్యాలీలు చేసుకుంటూ స్వస్థలాలకు పయనం అయ్యారు. అయితే సింఘు, టిక్రీ, గాజీపుర్​ సరిహద్దుల వద్ద శిబిరాల తొలగింపు అనధికారికంగా.. గత గురువారమే ప్రారంభమైంది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఇళ్లకు బయలుదేరారు. కాగా నేడు అధికారికంగా పూర్తిగా గుడారాలు, శిబిరాలను తొలగించి సామాన్లను స్వస్థలాలకు తరలిస్తున్నారు. Farmers protest LIVE updates

Leave Your Comments

రైతు రవి కుటుంబానికి కోటి పరిహారం !

Previous article

ధాన్యం కొనుగోలు ఆర్బీకే కేంద్రాల్లోనే..

Next article

You may also like