వార్తలు

ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కి రోల్ మోడల్ ప్రతిభా తివారీ

0
pratibha tiwari story

pratibha tiwari story

Farmer and Entrepreneur Pratibha Tiwari Story సేంద్రియ వ్యవసాయం వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రసాయన ఎరువులను పక్కనపెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కి విపరీతంగా డిమాండ్ పెరుగుతుండటంతో రైతులు కూడా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు సైతం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు ఆర్ధిక భరోసా కల్పిస్తున్నాయి. Organic Farming

Pratibha Tiwari story

నిజానికి సేంద్రియ వ్యవసాయ ములలోకి వెళితే ఈ తరహా ఫార్మింగ్ సింధులోయ నాగరికత నుంచే మొదలైంది. అయితే రానురాను సేంద్రియ వ్యవసాయాన్ని పక్కనపెట్టి రసాయనాలతో సాగు చేస్తూ వచ్చారు రైతులు. కాగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మరియు రైతుల సంక్షేమ శాఖ డేటా ప్రకారం మార్చి 2020 నాటికి దేశంలోని వ్యవసాయ భూమిలో 2.78 మిలియన్ హెక్టార్లలో రెండు శాతం మాత్రమే సేంద్రీయ సాగు చేస్తున్నట్టు తేలింది. Organic Products

Bhumisha Organics

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆర్గానిక్ ఫార్మింగ్ పథకం ద్వారా 16 జిల్లాలను ప్రోత్సహిస్తుంది. అందులో 1,800 గ్రామాల రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కాగా.. భోపాల్ కు చెందిన మహిళా రైతు మరియు పారిశ్రామికవేత్త ప్రతిభా తివారీ Pratibha Tiwari దాదాపుగా 12,00 hundreds of farmers మంది రైతుల్ని సాంప్రదాయ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నారు. 2016లో భూమిషా ఆర్గానిక్స్‌ Bhumisha Organicsను ప్రారంభించిన ఆమె వందలాది మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడమే కాకుండా వాటిని సేంద్రీయ ఆహార ఉత్పత్తులుగా ప్రాసెస్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా రేషన్ దుకాణాలకు చేరుకునేలా చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందేలా చేస్తున్నారు తివారీ. Pratibha Tiwari Story

Pratibha Tiwari story

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మద్దతు ధర దొరక్కపోవడం. ఆ సమస్య నుంచి రైతుల్ని కాపాడేందుకు ప్రతిభా తివారీ భూమిషా ఆర్గానిక్స్ ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా రైతులు తమ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కు మద్దతు ధర లభిస్తున్నది. రైతులు సేంద్రియ శిక్షణ తరగతులు, ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం తదితర సహాయాలను పొందుతున్నట్టు ఆమె తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఉత్పత్తులను చేరవేయడమే మా ప్రధాన లక్ష్యమని ఆమె చెప్పారు. ఇంకా ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. చాలా కష్టాలు పడి నలుగురైదుగురు రైతులను సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ఒప్పించగలిగాను. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా శ్రమించాను. దాదాపు మూడేళ్లపాటు అట్టడుగు స్థాయి రైతులతో మమేకమై వారి కోసం హోల్‌సేల్ మార్కెట్‌ను ఏర్పాటు చేశాం. నేను వివిధ కంపెనీలు మరియు ఆర్గానిక్ స్టోర్ యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నాను. ఈ మేరకు రైతుల ఉత్పత్తులను నేరుగా వారికి అందించడం ప్రారంభించాను. చివరికి వారు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని ప్రతిభా తివారీ తెలిపారు. farmer and entrepreneur pratibha tiwari

Bhumisha Organics

2020లో భూమిషా ఆర్గానిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి 10 మంది స్థానిక మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆమె భోపాల్‌లో సొంతంగా దుకాణం తెరిచి ఆర్గానిక్ అథెంటిక్, కెమికల్ రహిత మరియు సహజ ఉత్పత్తులు అనే మూడు విభాగాలలో 70 కంటే ఎక్కువ రకాల ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. వీటిలో పప్పులు, చిక్‌పీస్, సుగంధ ద్రవ్యాలు, మూలికలు, నల్ల గోధుమ పిండి మరియు వివిధ రకాల ఊరగాయలు ఉన్నాయి.  inspirational farmer and entrepreneur pratibha tiwari

Leave Your Comments

Herbal Mixture: పాడి పశువులకు పోషకాలు అందించండిలా?

Previous article

నాటుకోడి గుడ్ల ఉత్పత్తిలో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు.. లాభాలు మీవే!

Next article

You may also like