Export of Indian mangoes to US అమెరికాలో జో బైడెన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్ అమెరికా మధ్య బంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పుంజుకున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. భారతదేశ వ్యవసాయోత్పత్తుల ఎగుమతికి ఊతమివ్వడంలో దేశంలోని మామిడి మరియు దానిమ్మపండ్లు ప్రధానం కానున్నాయి. ఈ మేరకు అమెరికా వ్యవసాయ శాఖ (యుఎస్‌డిఎ)తో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో భారత్ అమెరికాకు మామిడి, దానిమ్మ పండ్లను ఎగుమతి చేయడం ప్రారంభించనుంది. అందులో భాగంగా భారతదేశం ఈ సంవత్సరం జనవరి నుండి అమెరికాకు మామిడి మరియు దానిమ్మ ఉత్పత్తులని ఎగుమతి చేయనుంది. కాగా అమెరికా ఏప్రిల్ 2022 నుండి ఎండుగడ్డి మరియు చెర్రీలను భారత మార్కెట్‌కు ఎగుమతి చేస్తుంది.
కాగా.. నవంబర్ 23, 2021న వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మరియు అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ తాయ్‌ల సహ-అధ్యక్షతనలో జరిగిన ఇండియా-అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరమ్ సమావేశానికి సంబంధించిన 12వ మంత్రివర్గ స్థాయి సమావేశం తర్వాత ఈ ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందాల ప్రకారం భారత్ లో పండిన మామిడి పండ్లపై ఎన్నో ఏళ్లుగా విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది.