ANGRU: ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ ఆర్థికశాస్త్ర విభాగం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం,లాం, గుంటూరులో వ్యవసాయ పంటల ముందస్తు ధరలను అంచనా వేయటానికి వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్నిఏర్పాటు చేశారు. దీనిని ఒక పరిశోధన పథకంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్ధిక సహయంతో స్థాపించారు.ఈ కేంద్రం 2024-25 ఖరీఫ్ కాలంలో సాగుచేస్తున్న వివిధ రకాల పంటల ముందస్తు ధరలు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎలా ఉండనున్నాయో అంచనా వేసింది. పంటల వారీగా ఈ విశ్లేషణ ఫలితాలు ఇలా ఉండవచ్చు.
పంటల ముందస్తు మార్కెట్ అంచనా ధరలు (సెప్టెంబర్-అక్టోబర్ మాసంలో) :
>వరి క్వింటాలుకు సాధారణ రకాలు రూ. 2,250 – 2,400, ఏ గ్రేడ్ రకాలు రూ. 2,350 -2,600,
>మొక్కజొన్న క్వింటాలుకు రూ.2,050-2,220,
>వేరు శనగ క్వింటాలుకు రూ. 6,740 – 7,320,
>జొన్నహైబ్రిడ్ రకం క్వింటాలుకు రూ. 2,900 -3,190 ,
>పత్తి క్వింటాలుకు రూ. 7,500-7,800,
>మిరపలో క్వింటాలుకు సాధారణ రకాలు రూ.14,500 -16,500,
>ప్రత్యేక రకాలు రూ.15,900 – 18,200,
>పసుపు కాయలు క్వింటాలుకు రూ.10,300 – 11,000,
>పసుపు కొమ్ములు రూ.11,200 – 12,000,
>కందులు క్వింటాలుకు రూ. 9,200-9,800,
>మినుములు క్వింటాలుకు రూ. 7,020-7,500,
>పెసలు క్వింటాలుకు రూ. 7,300-7,750,
>శనగలు క్వింటాలుకు రూ. 5,500 – 6,000 ల చొప్పున ఉండవచ్చని అంచనా.
ఏపీలో ఈ ముందస్తు ధరలు సమాచారం కోసం డా. వై. రాధ, ప్రధాన పరిశోధకులు
ఫోన్ : +91 94419 47022, 18004198800
amic2018angrau@gmail.com వారిని సంప్రదించవచ్చు.
www.angrau.ac.in వెబ్ సైట్ లో చూడవచ్చు.
గమనిక: పైన తెలిపిన ధరలను వివిధ పంటల ముఖ్య మార్కెట్లలో గత 16 నుంచి 28 సంత్సరాల ధరలను విశ్లేషించి అంచనా వేశారు. పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధరలు, ఎగుమతి లేదా దిగుమతి పరిమితులు లేదా ప్రభుత్వ మధ్యంతర జోక్యం / వివిధ పథకాల వల్ల అంచనా ధరల్లో మార్పు ఉండవచ్చు. ఇవి ముందస్తు అంచనా ధరలు మాత్రమే అని గమనించాలి.ధరల్లో హెచ్చు,తగ్గులు ఉండవచ్చు.
ALSO READ: ANGRU: ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీ నుంచి మూడు కొత్త వంగడాలు ప్రధాని నరేంద్ర మోది చేతుల మీదుగా విడుదల