తెలంగాణవార్తలు

Palamuru-Rangareddy: రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, కేసీఆర్ కే సాధ్యం

1
Palamuru Rangareddy lift scheme
Palamuru Rangareddy lift scheme

Palamuru-Rangareddy:  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడం పట్ల సీఎం కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేసింది. ఇప్పటికే జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తిచేశారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు.

Also Read: Acharya N.G. Ranga Agricultural University: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో డ్రోగో డ్రోన్స్ అవగాహన ఒప్పందం

Rangareddy lift scheme

Rangareddy lift scheme

ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విడుదల

ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈపాటికి ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు రెండేళ్ల క్రితమే ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉంది. కానీ ఒక వైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరో వైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయి త్వరలో నీళ్లివ్వడానికి సిద్దమయ్యారు. మిగిలిన పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు.

కేసీఆర్ కే సాధ్యం

కేసీఆర్ మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల కాళ్లను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని, మడి, మడి తడుపుతానని శపథం చేశారు.ఆ కల త్వరలోనే నెరవేరబోతున్నదన్నారు. 55, 60 ఏళ్ల జిల్లా ప్రజల వెతలు సంపూర్ణంగా తీరే శుభసమయం ఆసన్నమవుతున్నదన్నారు. రైతులు, ప్రజలు వేయి కళ్లతో ఆసమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నార్లాపూర్ , ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ అనుమతుల కోసం ఆగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ వ్యూహానికి, ముందుచూపుకు ఇది ప్రతీక. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తీసుకువెళ్లడం అనే అనితర సాధ్యమైన పని కేసీఆర్ కే సాధ్యమయింది. మరెవరివల్లా ఇది సాధ్యం అయ్యేది కాదు. ప్రాజెక్ట్ పనులను అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు ఎన్నోకుట్రలు చేశాయని, కేంద్రం అనేక కొర్రీలు వేసిందని మండిపడ్డారు. దశాబ్దాలుగా వివక్షకు గురైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మళ్లించి సస్యశ్యామలం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: Potato Nutritional Requirements: బంగాళదుంప పోషణ, విత్తన మార్గదర్శిక.!

Leave Your Comments

Acharya N.G. Ranga Agricultural University: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో డ్రోగో డ్రోన్స్ అవగాహన ఒప్పందం

Previous article

Palamuru-Rangareddy: ఇది తెలంగాణ చారిత్రాత్మక విజయం, రైతుల విజయోత్సవాలు

Next article

You may also like