ఆంధ్రప్రదేశ్వార్తలు

Acharya N.G. Ranga Agricultural University: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో డ్రోగో డ్రోన్స్ అవగాహన ఒప్పందం

3
Acharya N.G. Ranga Agricultural University
Acharya N.G. Ranga Agricultural University

Acharya N.G. Ranga Agricultural University: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం విషయంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన ఫలితాలతో రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయంలో పిచికారీకి యూరియా, డిఏపి లాంటి గుళికలను చల్లటానికి డ్రోన్లను ఎలా వినియోగించాలని అంశాల మీద సంపూర్ణ అవగాహనను కల్పించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో రైతాంగానికి మంచి వ్యవసాయ డ్రోన్ల ను రైతులకు అందించడానికి గాను మన రాష్ట్రంలోనే స్థాపించినటువంటి డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి డ్రోన్ల ఉత్పత్తి సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు డ్రోగో డ్రోన్స్ అనే సంస్థలు రాష్ట్ర రైతాంగానికి కావలసినటువంటి వ్యవసాయ డ్రోన్ పైలెట్లు శిక్షణ ఇవ్వడంలో దేశం లోనే ముందంజలో ఉండి రాష్ట్ర రైతాంగానికి ఎంతో తోడ్పాటు ఇస్తున్నాయి.

Also Read: Potato Nutritional Requirements: బంగాళదుంప పోషణ, విత్తన మార్గదర్శిక.!

Drogo Drones

Drogo Drones

రైతుల అభివృద్ధికి తోడ్పటానికి కదం

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పంటలకు పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను ఉపయోగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యవసాయ వర్సిటీ నిర్వహించిన డ్రోన్‌ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈనేపథ్యంలో ఈప్రయోగాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకొన్నది. రాష్ట్రంలోని అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు డ్రోన్లను అందించనున్నది. ఇందులో భాగంగా ఆగస్టు 11వ తేదీన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు. భవిష్యత్తులో అతి తక్కువ కాస్ట్ తో మరియు అత్యంత సౌలభంగా ఉండేటువంటి వ్యవసాయ డ్రోన్లు తయారీలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి పనిచేసి రైతుల అభివృద్ధికి తోడ్పటానికి కదం తొక్కారు. ఇవే కాకుండా వ్యవసాయంలో కృత్రిమ మేధస్సుతో వివిధ సాంకేతిక అనువర్తనాలు తయారు చేసి రైతాంగ కష్టాన్ని, నష్టాలను తగ్గించడానికి సాంకేతికతను అభివృద్ధి చేయడం కూడా ఇందులో ప్రధాన ఉద్దేశం. డ్రోన్ వినియోగించి పంట నష్టాలు అంచనా వేయడం ముందస్తు పంటల దిగుబడిన వేయడం, వాటర్షెడ్ ప్లానింగ్ కి కావలసినటువంటి అనువర్తనాలు తయారు చేయడంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయున్నాయి. ఈ కార్యక్రమానికి ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జి రామారావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్ ప్రశాంతి, మరియు సీఈవో డ్రోగో డ్రోన్ బొంతు బాల యశ్వంత్ కృష్ణ పాల్గొన్నారు.

Also Read: Castor Farming: ఆముదపు పంటను సాగు చేసి రైతులు మంచి లాభాలు ఎలా పొందాలి.?

Leave Your Comments

Potato Nutritional Requirements: బంగాళదుంప పోషణ, విత్తన మార్గదర్శిక.!

Previous article

Palamuru-Rangareddy: రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, కేసీఆర్ కే సాధ్యం

Next article

You may also like