వార్తలు

రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ బిందు, స్ప్రింక్లర్ల సేద్యం సదుపాయాలను కల్పించనున్న.. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్న కారు రైతులందరికీ బిందు, స్ప్రింక్లర్ల సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు వైఎస్సార్ జలకళ పథకం ద్వారా బోర్లు తవ్విస్తున్నందున వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. ఏం చేసినా సంతృప్త స్థాయి ( శాచ్యురేషన్ ) పద్ధతిలో ఉండాలని కొందరికీ మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ ఫలాలు అందాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవస్థలో అవినీతి ఉండకూడని చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న అంశంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మౌలిక వసతుల కల్పనపై సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న ప్రభుత్వ పథకాలు కొందరికి మాత్రమే కాకుండా అర్హులందరికీ అందాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవస్థలో అవినీతి ఉండకూడదని, ఏ పథకం అమలు చేసినా సంతృప్తి ఉండాలన్నారు. చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లను నిర్ణీత వ్యవధిలో అందించాలని ఆదేశించారు ప్రకాశం జిల్లా, రాయలసీమ ప్రాంతాల్లో పదెకరాల్లోపు, మిగతా ప్రాంతాల్లో 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు సరఫరా లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, ఉద్యాన వనాలు, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ సదుపాయాలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగన్ మాట్లాడుతూ సూక్ష్మ సేద్య పరికరాలను రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల రేటు తగ్గుతుందన్నారు. దీనివల్ల ఎక్కువ మంది రైతులకు అందించవచ్చు అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే, ఎంత రేటులో డ్రిప్, స్ప్రింక్లర్లు అందుబాటులోకి వస్తాయనే దానిపై అవగాహన వస్తుందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయిస్తున్నామని, సూక్ష్మ సేద్య సదుపాయం కల్పిస్తే మంచి ఫలితాలొస్తాయని అన్నారు. ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. దీనికి సంబంధించిన పరికరాలు కస్టమ్ హైరింగ్ సెంటర్లలో ఉండాలని ఆదేశించారు. మల్బరీ రైతుల సాగు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, పట్టు పరిశ్రమ పరిస్థితులు పూర్తిగా మెరుగుపర్చాలని ఆదేశించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా డ్రై స్టోరేజ్, డ్రెయింగ్ ఫ్లాట్ ఫామ్, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ ఫ్రా, ప్రైమరీ ప్రోసెసింగ్ సెంటర్లు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈ మార్కెటింగ్, జనతా బజార్లు, ప్రైమరీ ప్రోసెసింగ్ యూనిట్ల వంటి 14 రకాల బహుళ సదుపాయం కేంద్రాల ఏర్పాటుకు రూ. 14,532 కోట్లు ఖర్చు అవుతుందని జగన్ వివరించారు.

Leave Your Comments

మిరపను ఆశించు పురుగులు – నివారణ

Previous article

ఏడాది పొడవునా మామిడి పండు అందుబాటులో ఉంటుంది.. రైతు శ్రీకిషన్

Next article

You may also like