SOYBEAN: సోయాచిక్కుడు లెగ్యూమ్ జాతి పంట. సొయా గింజల్లో 43 శాతం మాంసకృత్తులు, 20 శాతం నూనె ఉంటుంది. ఇది పప్పుధాన్యపు పంట అయినప్పటికీ నూనెగింజల పంటగా ప్రాచుర్యం చెందింది. రైతులు వానాకాలంలో సాగుచేస్తున్నఈ పంట ప్రస్తుతం కాయ దశలో ఉంది. ముఖ్యంగా ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల ఆకుమచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది.
తెగులు లక్షణాలు: ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు ఆశించిన ఆకుల మీద ముదురు బూడిదరంగు మచ్చలు గుండ్రంగా ఏర్పడి ఆకులు అంతా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి. ఈ తెగులు లక్షణాలు ఆకుల మీదనే కాకుండా కాయల మీద కూడా వ్యాపించి విత్తన నాణ్యతను దెబ్బతీస్తుంది. కాయల మీద ముదురు వలయకారపు మచ్చలు ఏర్పడి శిలీంద్రకారక బీజాలు కాయలోని విత్తనాలకు వ్యాపించడం వల్ల విత్తనాలు బూడిద రంగులోకి మారి గింజ నాణ్యత కోల్పోతుంది. ఈ తెగులు నివారణకు కార్బెండాజిమ్ 1 గ్రాము లేదా టెబ్యూకోనజోల్ 1 గ్రాము లేదా ప్రొపికోనజోల్ 1 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే పంట నాణ్యత కోల్పోకుండా ఉంటుంది.
బి. రాజేశ్యరి, శ్రీధర్ చౌహన్, బానురేఖ, అనిత, డా.సురేష్, వ్యవసాయ కళాశాల,ఆదిలాబాద్
ALSO READ: Soyabean: సోయాచిక్కుడులో పల్లాకు తెగులు..