ప్రపంచంలో కట్‌ఫ్లవర్ పరిశ్రమ ప్రఖ్యాతి చెందిన పరిశ్రమ. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఈ పూల వ్యాపారం సంవత్సరానికి 2 వేల కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తుంది. గులాబి, లిల్లీ, చామంతి, బంతి వంటి వాటితో పాటు గ్లాడియోస్ వంటి పూలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారతదేశపు పుష్ప పరిశ్రమ సాంప్రదాయ పుష్పాల సాగు నుండి కట్‌ఫ్లవర్ సాగు చేపట్టి ఎగుమతి కూడా చేస్తుంది. మొత్తం 60 వేల హెక్టార్లలో 2 కోట్ల టన్నుల విడిపూలు 500 మిలియన్ టన్నుల కట్‌ఫ్లవర్స్ దిగుబడిని సాధించాలని అంచనా. కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు పూలు యొక్క నాణ్యతను దెబ్బతీయడం వల్ల నాణ్యత, దిగుబడిలో ఆర్థికంగా నష్టం జరుగుతుంది.
లిల్లీ
బోట్రైటిస్ :
ఈ తెగులు సాధారణంగా రెండు జాతుల శిలీంధ్రాల వలన వస్తుంది. అవి బోట్రైటిస్ ఇలిప్టికా, బోట్రైటిస్ సినేరియా. వీటిలో ఇలిప్టికా వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ శిలీంధ్రాలు సాధారణంగా ఆకులు, విచ్చిన పూలు, కాయలు, విత్తనాలను ఆశిస్తాయి. చలికాలంలో తెగుళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిలీంధ్రం వేసవి కాలంలో సిద్ధబీజాలను విడుదల చేస్తుంది. శిలీంధ్రం వర్షాకాంలో నీటి తుంపర్ల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగు సోకిన మొక్కల్లో మొట్టమొదటగా గమనించతగ్గ క్షణం ఆకుపై తెల్లని మచ్చులు ఏర్పడడం. ఈ గుండ్రటి మచ్చులు తరువాత దశలో నీటి బిందువు ఆకారంలోకి మారుతాయి. మచ్చల అంచు లేత వర్ణంలోను, మధ్య భాగం ముదురు వర్ణంలోనూ ఉంటుంది. తెగుళ్ళ తీవ్రత పెరిగే కొద్దీ ఆకులు ఎండిపోయి చనిపోతుంది. తెగులు సోకిన పూరేకు లేత లేదా ముదురు గోధమ రంగులోకి మారి ఎండిపోయి, నాణ్యత కోల్పోతాయి.
తేమ వల్ల వాతావరణంలో శిలీంధ్రం వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. స్ప్రింక్లర్ ద్వారా నీరు పెట్టడం కంటే డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం ద్వారా తెగుళ్ళ తీవ్రత తగ్గించవచ్చు. మొక్క భాగాలపై నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలి. తెగులు సోకిన మొక్క భాగాను ఏరి దూరంగా పారవేయాలి లేదా నాశనం చేయాలి.
మొదులు కుళ్ళు :
సాధారణంగా మన ప్రాంతాల్లో మొదులు కుళ్ళు ఫ్యుసేరియం జాతుల వల్ల వస్తుంది. ఇది లిల్లీలో తీవ్ర నష్టాన్ని కులుగచేస్తుంది. తెగులను కులుగచేసే శిలీంధ్రం వేరు వ్యవస్థ ద్వారా ప్రవేశిస్త్తుంది. దుంప లేదా బల్బ్‌కు ఉన్న స్కేల్స్ లేదా పొలుసుబ్బు నుండి విడిపోతాయి. ఆకు పసుపు రంగుకు మారిపోతాయి. కాడలు ఎండిపోతాయి. తల్లి దుంపకు అనుకొని ఉన్న పిల్ల దుంపు నల్లగా మారి, కుళ్ళి చనిపోతాయి. తర్వాత తల్లి దుంప చనిపోతుంది. ఒకసారి తెగులు సోకిన తరువాత తగ్గించడం చాలా కష్టం. ఈ తెగుళ్ళ నివారణకు తెగులు సోకిన బుట్టను పెకలించి తగలబెట్టాలి. తెగులు సోకిన నేలలో సుమారు 4 సంవత్సరా వరకు లిల్లీ పంట వేయకూడదు. పనిముట్లు బాగా శుభ్రం చేసుకోవాలి. నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని ఎరువు ఎక్కువగా వాడరాదు. మొక్క నాటేటప్పుడు కొంత సున్నం వాడటం వల్ల ఈ తెగుళ్ళ ఉధృతి తగ్గించవచ్చు. దుంప రవాణా, నాటేటప్పుడు, కలుపు తీత సమయంలో గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి.
గులాబి
బూడిద తెగు :
ఆకుపై బూడిద వంటి తెల్లని పదార్థం ఏర్పడి, ఆకు ముడుచుకొని పోతాయి. తెగులు మిగిలిన భాగాలకు వ్యాపించి శాఖీయ మొగ్గులు, కొమ్ములు ఎండిపోతాయి. తెగుళ్ళకు గురైన మొగ్గులు పుష్పాలుగా విచ్చుకోలేకపోతాయి. పూరేకు రంగు మారి వడలి, ఎండిపోతాయి. దీని నివారణకు డైనోకాప్ 1 మి.లీ లేదా కార్బండిజమ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. తెగులు తట్టుకునే రకాలను ఎంచుకొని సాగు చేయాలి. తెగులు సంక్రమించిన మొక్క శాఖను తొలగించి కాల్చివేయాలి.
నల్ల మచ్చులు :
ఆకుల మీద గోధుమ రంగు నుండి నలుపు రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు యొక్క అంచు నీటి అలను పోలి ఉంటాయి. అదే విధమైన మచ్చలను రక్షక పత్రాలు, కేసర దండాలు, పుష్పవిన్యాసం మీద చిన్న గుండుసూది తల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. వీటినే శిలీంధ్రం ఏర్పరచే ‘అసర్క్యులై’ అంటారు.
రోగ నిరోధక శక్తి గల రకాలైన గంగ, గల్బుర్, కవిత, ప్రేమ, పూసాసోనియా, జవహర్, గ్రాండ్ బపెరా మొదలైనవి వాడడం, ఉపయోగపడని మొక్క భాగాలు తొగించడం వంటి సాంకేతిక పద్ధతులను అవంభించడం వల్ల తెగుళ్ళను నివారించవచ్చు. వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. నివారణకు కాప్టాన్ 2 గ్రా. లేదా మాంకోజెబ్ 2 గ్రా. లేదా కార్బండిజమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కొమ్మ ఎండు రోగం :
మొక్కపై భాగం నుండి కిందికి ఎండిపోతుంది. ఈ తెగులు సంక్రమణ కందిరీగలు కలుగ చేసే గాయాల ద్వారా, ప్రూనింగ్ చేసిన లేదా కత్తిరించిన కొమ్మల ద్వారా జరుగుతుంది. తెగులు సోకిన కొమ్ము నలుపు రంగుకు మారుతాయి. కాండం, వేర్లు గోధుమ రంగుకు మారిపోతాయి. నివారణకు ప్రూనింగ్ చేసిన కొమ్మను వేంటనే రాగి ధాతు సంబంధిత రసాయనాను పేస్ట్ లాగా చేసి కత్తిరించిన ప్రదేశాల్లో పూయాలి. లేదా పచ్చిపేడ, మట్టితో కలిపిన పేస్టు పూసి కూడా ఈ తెగును కొంత వరకు నివారించవచ్చు.
చామంతి
ఆకుమచ్చు :
ఆకుపై ముదురు గోధుమ రంగు మచ్చలు పెద్దవి లేదా చిన్నవి ఏర్పడతాయి. కొన్ని సమయాల్లో ఆకు కింది భాగంలో కూడా మచ్చలు కన్పిస్తాయి. అనేకమైన చిన్న మచ్చు కలిసిపోయి పెద్ద మచ్చలుగా ఏర్పడతాయి. మచ్చల మధ్య భాగం బూడిద రంగులోనూ దాని చుట్టూ ఉన్న అంచు ఆకుపచ్చ రంగులో ఉండి ఆకు రాలిపోతాయి.
యాజమాన్యం :
మొక్కకు అవసరానికి మించిన నీటిని ఇవ్వరాదు. తెగులు సోకిన మొక్కను తొగించి తలగుబెట్టాలి. రోగ నిరోధక రకాలైన లిల్లీపుట్, పిలియస్, అపరిజిటో వంటి రకాలను సాగు చేయడం ద్వారా తెగుళ్ళ తీవ్రతను తగ్గించవచ్చు. డైథేన్ ` ఎమ్`45, 0.25 శాతం, కవచ్ 0.25 శాతం వంటి శిలీంధ్ర నాశకాలను పిచికారీ చేయడం వల్ల తెగులు తగ్గించవచ్చు.
బోట్రైటిస్ ఎండు తెగులు :
పూల యొక్క కింది వరుస రేకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశలో మచ్చలు పైరేకులకు కూడా వ్యాపిస్తాయి. తెగులు సోకిన మొక్క భాగాలు బూడిద రంగు శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటాయి.
యాజమాన్యం :
గ్రీన్‌హౌస్‌లో తేమ 98 శాతం కంటే తక్కువగా ఉండేటట్లు చూడాలి. క్లోరోథలోనిల్, మాంకోజెబ్, ఇప్రోడియోగ్ వంటి మందును స్ప్రే చేయడం ద్వారా తెగును నియంత్రించవచ్చు.
ఆస్కోఖైటా పూరేకు ఎండు తెగులు :
పూల పెరుగుదల ఒక వైపు ఆగిపోతుంది. మొగ్గలోని పూరేకు ఒక వైపు మాత్రమే విచ్చుకుంటాయి. విచ్చుకున్న పూ రేకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు, కాండంపై నల్లని లేదా గోధుమ రంగు నీలారాకారపు మచ్చలు ఏర్పడతాయి. చివరి దశలో పూలు, మొగ్గలు రాలిపోతాయి.
యాజమాన్యం :
పూలు తడిచేలా పై నుండి నీరు పెట్టరాదు. తెగుల లక్షణాలు గమనించిన మొక్కల్లో క్లోరోథలోనిల్ లేదా ప్రోపికనజోల్ ని మాంకోజెబ్ కలిపి ఆకుపై పిచికారి చేయాలి.
స్టంట్ లేదా మొక్క గిడసబారడం :
వివిధ రకాల చామంతిలో తెగుల లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా లేతఆకు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మొక్క ఎదిగే ఎత్తులో సగం కూడా పెరగవు. పువ్వుల యొక్క పరిమాణం చిన్నదిగా అయిపోతుంది.
యాజమాన్యం :
వైరస్ సోకని ఆరోగ్యవంతమైన మొక్కులు నాటుకోవాలి. తెగులు సోకిన మొక్కను నాశనం చేయాలి. వాడిన పనిముట్లను శుభ్రం చేయాలి.