వార్తలు

బంగ్లాపై షేడ్ నెట్ లో వివిధ రకాల సాగు..

0

కొందరు మాత్రం దీనిని ఔపోసన పట్టి ఇంటి పైన మిద్దెను వాడుకుంటున్నారు. సత్ఫలితాలు పొందుతున్నారు. ఈకోవలోని వ్యక్తి నర్సాపూర్ తపాలా శాఖలో ఉద్యోగి నర్సింహారెడ్డి పట్టణ శివారులో ఇంటిని నిర్మించుకొని మిద్దెపై సేంద్రియ సాగు విధానంలో పూలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఆయన, భార్య అనురాధ, కుమారులు సుచిత్ రెడ్డి, సంతోష్ రెడ్డి తలా రెండు గంటలు మొక్కల నిర్వహణకు సమయం కేటాయిస్తారు. యూట్యూబ్ లో వీడియోలను అనుకరిస్తూ పెంపకం చేపట్టారు. ప్లాస్టిక్ బకెట్లలో పెంచుతున్నారు. రెండొందల మొక్కలు హైదరాబాద్, లింగంపల్లి, తదితర ప్రాంతాల నుంచి కొని తెచ్చుకున్నారు. ప్లాస్టిక్ నీటి సీసాలకు రంధ్రాలు చేసి నీటి బిందువులను అందిస్తున్నారు. షేడ్ నెట్ ఏర్పాటు చేశారు. కేవలం ఆరు నెలల కాలంలో ఇంటిని పచ్చందాల గృహంగా తీర్చిదిద్దారు.
గులాబీ ఎనిమిది రకాలు, బంతి, మల్లెలు, బెండ కాయ, వంకాయ, టమాటా, పాలకూర, కొత్తిమీర, పుదీనా, తీగ రకాలు, సపోట, అంజూరు, మామిడి, డ్రాగన్, స్టార్ ఫ్రూట్, పుచ్చ, స్ట్రాబెర్రీ, రణపాల, తిప్పతీగ మొక్కలను సంరక్షిస్తున్నారు. వీటికి వేప, కుంకుడు కషాయం, నీమ్ ఆయిల్, ఆవు మూత్రం వినియోగిస్తూ సేంద్రియ సాగు చేపట్టారు. పేడ, కొబ్బరి పీచు మిశ్రమం, ఎర్రమట్టి వంటి 30 శాతం, ఇసుక పది శాతం వినియోగిస్తున్నారు. సాయంత్రం సమయాల్లో మిద్దెపై పచ్చని సీమలా సేద తీరుతూ కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. స్లాబుపై పడిన నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతను కింద ఏర్పాటు చేశారు. కాలుష్యం లేని కూరలు, పండ్లను ఆహారంలోకి తీసుకోగలుగుతున్నామని నర్సింహారెడ్డి గర్వంగా చెబుతున్నారు. కొంత కష్టపడితే పైసల ఆదాతో పాటు ఆరోగ్యము సొంతమవుతుందంటున్నారు.

Leave Your Comments

మల్టీలెవల్ షేడ్ నెట్ లో కూరగాయల సాగు..

Previous article

గోంగూరలో పోషకాలు మెండు

Next article

You may also like