తెలంగాణవార్తలు

Devarakadra Check Dam: జలసిరులతో కలకలలాడుతున్న దేవరకద్ర నియోజకవర్గం.!

2
Check Dams Constructed by Devarakadra TRS MLA Ala Venkateshwara Reddy
Check Dams Constructed by Devarakadra TRS MLA Ala Venkateshwara Reddy

Devarakadra Check Dam: జల సంరక్షణకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన కృషికి స్కోచ్ ఇండియా లిమిటెడ్ జ్యూరీ స్కోచ్ గోల్డ్ అవార్డు దక్కింది. జల సంరక్షణ చర్యలతో చెక్ డ్యాంలు సైతం టూరిజం స్పాట్స్ గా మారాయి. దీంతో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.

ఒకనాడు ఎడారి ప్రాంతాన్ని తలపించిన దేవరకద్ర నియోజకవర్గం ప్రస్తుతం జలసిరులతో కలకలలాడుతోంది. ఇంజనీరింగ్ పట్టబద్ధుడైన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కృషి వల్ల ఒకనాడు వలసలతో అల్లాడిన ఈ ప్రాంతం నేడు బంగారు పంటలతో కలకలలాడుతూ రైతన్న ముఖాల్లో చిరునవ్వులు చూస్తోంది. 2014 సంవత్సరానికి ముందు దుర్భర దారిద్రం ఆకలి చావులు వలసలు ఇలా అనేక రకాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పట్టుదల కృషి వల్ల అభివృద్ధి పథంలో వడివడిగా అడుగులు ముందుకు వేసుకుంటూ దూసుకుపోతోంది.

Devarakadra MLA Ala Venkateswara Reddy

Devarakadra MLA Ala Venkateswara Reddy

దేవరకద్ర నియోజకవర్గంలో ఆకలి చావులు తగ్గించి వలసలను అరికట్టడానికి ఏకైక మార్గం రైతులకు సాగునీరు అందించడమే అని గుర్తించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి దాదాపుగా 170 కోట్ల రూపాయల వ్యయంతో పెద్ద ఎత్తున నిర్మించి వాన నీటి జలాలను ఓడిసిపట్టారు. ఫలితంగా ఆ చెక్ డ్యాముల ద్వారానే దాదాపు 1,000 ఎకరాలు నియోజకవర్గం లో సాగులోకి వచ్చింది. దీంతో రైతన్నలు బంగారు పంటలు పండిస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. తమ బతుకులు బాగుపడ్డాయి అంటే అది కేవలం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కృషి వల్లనే సాధ్యమైందని ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని ఈ ప్రాంతం అన్నదాతలు సంతోషంగా చెబుతున్నారు.

పాలమూరు జిల్లాలో భూగర్భజలాలను పెంపొందించటం కోసం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లాలో 170 కోట్లతో 27 చెక్ డ్యాములు పూర్తి చేసి భూగర్భజలాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నారు. దీని వల్ల 4 వేల బోర్లు రీచార్జ్ అయ్యాయి. భూగర్భజలాలు పెరిగాయి. నీటి పారుదల శాఖ ద్వారా జల సంరక్షణ కార్యక్రమాలతోపాటు , చెక్ డ్యాముల నిర్మాణంతో సత్ఫలితాలందాయి.

Devarakadra MLA Ala Venkateswar Reddy Built Check Dam To Agriculture For Farmers

Devarakadra MLA Ala Venkateswar Reddy Built Check Dam To Agriculture For Farmers

Also Read: Backyard Gardening: పెరటి తోటల పెంపకం.!

నీటి వృధాను అరికట్టి జల సంరక్షణ చర్యలతో గ్రామాల్లో అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరిదేవిపల్లిలో 4 కోట్ల 90 లక్షల వ్యయంతో పూర్తయిన గౌరిదేవిపల్లి చెక్ డ్యాం నిర్మాణంతో గౌరిదేవిపల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో 200 ఎకరాలు సాగులోకివచ్చాయి. అడ్డాకుల మండలం పొన్నకల్ లో 20 కోట్ల 50 లక్షల తో నిర్మించిన చెక్ డ్యాంతో పొన్నకల్, రాచాల , కన్మనూర్, వర్నె చెక్ వెయ్యి 20 ఎకరాలు సాగులోకి వచ్చాయి. హన్వాడ మండలం వేపూర్ లో రెండు చెక్ డ్యాంలతో గుండ్యాల, లింగంపల్లి 400 ఎకరాలు సాగులోకి వచ్చాయి. మూసాపేట మండలం నిజలాపూర్ లో చెక్ డ్యాంతో నిజలాపూర్, సంకలమద్ది, కొమిరెడ్డిపల్లిలో 400 ఎకరాలు సాగులోకి వచ్చాయి.

చిన్నచింతకుంట మండలం లాల్ కోట లో 4కోట్ల 90 లక్షలలో 250 ఎకరాలు సాగులోకి రావటంతో పాటు 650 బోర్ వెల్స్ రీచార్జ్ అయ్యాయి. చిన్నచింతకుంట మండలం పల్లమర్రి కురుమూర్తి, ఎదులాపూర్ 36 కోట్లతో చెక్ డ్యాం పూర్తవగా 1250 ఎకరాలకు సాగునీరందుతోంది. 4వేల బోర్లు రీచార్జ్ అయ్యాయి. దేవరకద్ర మండలంలో 25 కోట్ల తో గూరకొండ, చిన్నరాజమూర్, పెద్దరాజమూర్, రేకులంపల్లి చెక్ డ్యాంల పూర్తితో వెయ్యి 700 ఎకరాలు 3వేల 900 బోర్లు రీఛార్జ్ అయ్యాయి. మిడ్జిల్ మండలంలో 35 కోట్ల తో చెక్ డ్యాంలతో చిల్వెరు, అయ్యవారిపల్లి, కొత్తూరు 5వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. చెక్ డ్యాంల ద్వారా సాగునీటి అవసరాలు తీరటంతో పాటు టూరిస్ట్ స్పాట్ల్ లా మారాయి. ఎన్నో ఏళ్లుగా డ్రై అయినపోయిన వేలాది బోర్లు మళ్లీ రీచార్జ్ అయ్యాయి.

Also Read: Nela Vemu Cultivation: నేలవేము సాగులో మెళుకువలు.!

Leave Your Comments

Backyard Gardening: పెరటి తోటల పెంపకం.!

Previous article

Sowing Seeds with Tractor: ట్రాక్టరుతో విత్తనం విత్తుదాం.!

Next article

You may also like