ఆరోగ్యం / జీవన విధానంవార్తలు

నిత్యం ఆరోగ్యం గా ఉండాలంటే మనము పాటించవలసిన ఆహారపు అలవాట్లు

0

సాధారణంగా దెబ్బలు తగులుతుంటాయి.ఇంకా చాలా మందికీ  జ్వరాలు ఇంకా అనేక రోగాలతో బాధ పడుతూ వుంటారు. అవి తగ్గాలంటే యాంటి బయోటిక్ అవసరం.ఇక మన వంటింట్లోనే మనకు కావాల్సిన ఆరోగ్యం ఉంటుంది.ఇక ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల నిత్యం ఆరోగ్యంగా వుంటారు. వెల్లుల్లిలో వుండే ఔషధ గుణాలు మరెందులోనూ ఉండవు. వెల్లుల్లి లో యాంటి ఫంగల్ ,యాంటి వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.అంతేగాగ బోలెడన్ని ఖనిజాలు,విటమిన్లు,పోషకాలు ఉంటాయి.రోజు వంటల్లో వెల్లుల్లి ని చేర్చితే ఆరోగ్యం మే వెంటే ఉంటుంది. ప్రకృతి అందించిన తీయని ఔషధం తేనె.రోజు దాల్చన చెక్క,తేనె సమపాళ్లలో  కలుపుకుని ఒక చెంచా చొప్పున తీసుకుంటే చాలు శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

తేనెలో వుండే యాంటిసెప్టిక్, యాంటి మైక్రోబియల్,యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలు బ్యాక్టిరియాను నాశనం చేస్తాయి.వేపలో యాంటి బయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

వేప ఆకులను నేరుగా ఉపయోగిస్తే చాలా లాభాలున్నాయి.మొటిమలు తదితర  స్కిన్ ఇన్ఫెక్షన్లకు వేప మంచి ఔషధం.వేప పుల్లతో దంతాలను తోమడం మంచిది.దీనివల్ల పళ్ళు బలంగా  వుంటాయి.చిగుళ్ళ సమస్య దరి చేరదు.పసుపు లో వుండే కర్ క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్దిని అరికడుతుంది.నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్ వైరస్ రెట్టింపు కాకుండా పసుపు నియంత్రిస్తుంది.పసుపు లో ఉండే యాంటి సెప్టిక్ వల్ల శ్వాస కోశ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.పసుపులో యాంటి ఇన్ ఫ్లమేటరీ వల్ల కీళ్ళు బలపడతాయి.కఫం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే వారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.యాంటి బయోటిక్ గుణాలు అల్లంలో పుష్కలంగా ఉంటాయి.

ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. శ్యాసకోశ సంబంధిత సమస్యలతో పాటు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ల ను అల్లం తగ్గిస్తుంది.కాబట్టి… ఉదయాన్నే వెచ్చగా ఒక గ్లాస్ అల్లం టీ తాగితే మంచిది.

 

Leave Your Comments

ఆలిండియా హార్టికల్చర్ మరియు అగ్రికల్చర్ షో

Previous article

సెరికల్చర్,మల్బరీ సాగుపై సీ.ఎస్.ఐ.టీ డైరెక్టర్ తో సమావేశమైన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like