జాతీయంవార్తలు

D.D Kisan Studio Inagurated: రైతు కళ్యాణార్థం డి .డి కిసాన్ స్టూడియో ప్రారంభం.!

1
D.D Kisan Studio Inagurated
D.D Kisan Studio Inagurated

D.D Kisan Studio Inagurated: ప్రసార భారతి నూతన ట్వీట్ ప్రకారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ.నరేంద్ర సింగ్ తోమర్ గారు మినిస్టర్ అఫ్ స్టేట్, డిపార్ట్మెంట్ అఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ శ్రీ కైలాష్ చౌదరి మరియు సృస్తి శోభా గార్ల సమక్షంలో ఢిల్లీలో డి .డి కిసాన్ స్టూడియోను జులై 1 2022 ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ప్రారంభించినట్లు పేర్కొంది.

D.D Kisan Studio Inagurated

D.D Kisan Studio Inagurated

Also Read: Adulteration in Turmeric: పసుపు కల్తీ – వినియోగదారులారా జాగ్రత్త.!

DD కిసాన్ అనేది 24-గంటల భారతీయ వ్యవసాయ ఛానెల్. ప్రస్తుతానికి ఇది ఇది దూరదర్శన్ యాజమాన్యంలో ఉంది. దీనిని 26 మే 2015న ప్రారంభించారు. ఈ ఛానెల్ వ్యవసాయం మరియు సంబంధిత రంగాల కోసం దేశానికి అంకితం చేయబడింది. ఇది రైతులకు కొత్త వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణపై నిజ-సమయ ఇన్‌పుట్‌ల గురించి, ఇతర సమాచారంతోపాటు సేంద్రీయ వ్యవసాయం సమాచారం అందిస్తుంది.

డి .డి కిసాన్ రైతుల కోసం ఏం చేస్తుంది ?
రైతులకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు మరియు నిర్ణయాలను తెలియజేయడం దీని ప్రధాన అజెండా.
• భారతదేశంలోని నిపుణులు మరియు వ్యవసాయ-సంస్థల సహాయంతో వ్యవసాయం మరియు పశుపోషణకు సంబంధించిననూతన సాంకేతిక సమాచారాన్ని రైతులకు అందించడం.
• భారత ప్రధాన మంత్రి మోడీ గారు ఇచ్చిన నినాదం “పర్ డ్రాప్ మోర్ క్రాప్” కోసం నీటి సంరక్షణ మరియు సరైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించడం.
• నాణ్యమైన విత్తనాలు, కొత్త వ్యవసాయ పరికరాల లభ్యత, భూసార పరీక్షలు మరియు మార్కెట్ ధరల గురించిన వివరాలు అందించడం.
• వాతావరణ మార్పు సమస్యలు, అంచనా, సాధారణ వాతావరణ నివేదిక తయారీ మరియు భారతదేశం అంతటా వాతావరణ మార్పు, పంటలపై ప్రభావం గురించి ప్రసారం చేయడం.

Also Read: Agricultural Research Station-Mudhole: తెలంగాణలో పత్తిపై పరిశోధించి ఏకైక పరిశోధనా కేంద్రం

Leave Your Comments

Adulteration in Turmeric: పసుపు కల్తీ – వినియోగదారులారా జాగ్రత్త.!

Previous article

PJTSAU: పిజె టిఎస్ ఎయూ లో ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ నోడల్ అధికారుల 7వ సదస్సు.!

Next article

You may also like