మట్టి లేకుండా మొక్కల పెంపకం. మట్టి లేకుండా ఎలా అనుకుంటున్నారా.. ఈ విధానాన్ని చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. కొబ్బరి పీచుతో సాగు. ఇది వినడానికి కొత్తగా ఉన్నా నమ్మాల్సిందే. ఎంతో అద్భుతమైన ఈ ప్రయోగాన్ని సక్సెస్ గా చేసి చూపించారు జీడిమెట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శాస్త్రవేత్తలు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో మొక్కలు పెంచడమే కాకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో చేపట్టే ఈ సాగు వల్ల మంచి పోషకాలున్న కూరగాయలను పండించవచ్చని చెబుతున్నారు. స్వచ్ఛమైన కూరగాయలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ధీమాగా చెబుతున్నారు. కొబ్బరి పీచును ముక్కలు.. ముక్కలుగా చేసి పొడిగా మారుస్తారు. ఆ పొడిని గ్రోబ్యాగ్ (ప్లాస్టిక్ కవర్) లో నింపుతారు. ప్రతీ బ్యాక్ 18 ఇంచుల వెడల్పులో 18 ఇంచుల పొడవులో ఉంటుంది. ఇందులో కాస్త సేంద్రియ ఎరువులు కలిపి విత్తనాలు లేదా మొక్కలు నాటుతారు. మొక్కనాటిన, నాటి నుంచి ప్రతీ రోజు నత్రజని, భాస్వరం, పోటాష్ ల మిశ్రమాన్ని మితంగా అందించాలి. వాటిలో ఇతర సేంద్రియ ఎరువులు సైతం వేసుకోవచ్చు.
కొబ్బరి పీచుతో పండించే పంటలకు క్రిమి, కీటకాలు దరి చేరవు. ఈ పద్ధతి రైతులకు ఎంతో ప్రయోజనకరం. ఈ విధానంలో జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వంకాయ, ఆకుకూరలు, టమాటో, కొత్తిమీర, మెంతి తదితర పంటలు పండిస్తున్నారు. క్రమపద్ధతిలో డ్రిప్ సిస్టం ద్వారా కావడంతో రైతులకు సైతం శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. బ్యాగ్, బ్యాగుకు మధ్యలో 2 ఫీట్ల వెడల్పు వదిలి వరుసగా పేర్చాలి. మొక్కలు పెట్టిన 45 రోజుల్లోనే మొక్కలు పెరిగి పంటలు చేతికొస్తాయి. లైన్ లకు మధ్యలోనూ 2 ఫీట్లు వదలాలి. ఒక్కో మొక్క ద్వారా 3 కిలోల పంట చేతికొస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఉన్నతాధికారులు సూచనతో ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం పాలీ హౌస్ ల్లో ప్రత్యేక పంటలతో పాటు ఇతర పంటలు వేసే పంటల ఒడ్డులో గ్రో బ్యాగులు పెట్టి పంటలు వేశారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ పంటలను ఎక్కువగా నగరాల్లో ఉన్న చిన్న స్థలాల్లో పెట్టుకునేందుకు ఇష్టపడుతున్నారు. రైతులకు కూడా ప్రయోజనకరము.
కొబ్బరి పీచుతో కూరగాయల సాగు..
Leave Your Comments