తెలంగాణవార్తలు

Monsoon Cotton Cultivation: వానాకాలం 70 లక్షల ఎకరాలలో పత్తి సాగు

0
Monsoon Cotton Cultivation
Monsoon Cotton Cultivation

Monsoon Cotton Cultivation: రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడి కార్యాలయంలో విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఉద్యానశాఖ సలహాదారు శ్రీనివాసరావు, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Monsoon Cotton Cultivation

Monsoon Cotton Cultivation

ప్రస్తుత వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాలలో పత్తి, 15 లక్షల ఎకరాలలో కంది పంటలను సాగు చేసే విధంగా లక్ష్యం నిర్దేశించారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి. దీనికోసం అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భూసారాన్ని పెంచడం కోసం అందుబాటులో ఉన్న 11 లక్షల ఎకరాలకు పచ్చి రొట్ట ఎరువులు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది, మరో 5 లక్షల ఎకరాలకు పంపిణీకి సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Also Read: TS Kisan Call Centre: రైతు సేవకు వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ అంకితం.!

అవగాహనా రాహిత్యం వలన బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటిమీటర్లు, తేలిక నేలలలో 5 నుండి 6.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయితేనే పంటలు విత్తుకోవడానికి సిద్దం కావాలని తద్వారా విత్తనాలు నష్టంకావడం, మొలకశాతం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తప్పుతాయి రైతులకు సూచించారు.

నకిలీ విత్తనాల బెడద లేకుండా రైతులు ఎట్టి పరిస్థితులలో విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దు. విత్తనాలను ఆధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని, కొన్న వద్ద తప్పనిసరిగా రశీదు తీసుకోవడంతో పాటు విత్తిన విత్తనాల ఖాళీ ప్యాకెట్లను భద్రపరచుకోవాలని సూచించారు. విత్తనాలలో నాణ్యత లోపిస్తే విక్రయించిన వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఇవి తోడ్పడుతాయి . ఈ విషయంలో ఏ మాత్రం సందేహాలున్నా క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవాలని మంత్రి అన్నారు.

ఇంతే కాకుండా “నకిలీ మిరపనారు ఎవరు అమ్మినా కఠినచర్యలు తప్పవు. మిరపనారు సాగు చేసే నర్సరీలను  ఉద్యాన అధికారులు తనిఖీలు చేయాలి. అవసరమయిన మేరకు అందుబాటులో ఎరువులు .భాస్వరం అందించే కాంప్లెక్స్, డీఎపీ వంటి రసాయన ఎరువులు మాత్రమే కాకుండా ఫాస్ఫో బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులు రైతులు విరివిగా ఉపయోగించాలి. మితిమీరిన రసాయన ఎరువులు ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల దిగుబడి, నాణ్యత లోపించడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి ” అని అన్నారు.

Also Read: Invention of the Wheel: చక్రం పుట్టుకే పారిశ్రామిక విప్లవానికి నాంది.!

Leave Your Comments

TS Kisan Call Centre: రైతు సేవకు వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ అంకితం.!

Previous article

Cotton Crop Cultivation: పత్తి సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకం.!

Next article

You may also like