CM Stalin టమోటా ధరలు హెచ్చుతగ్గులు సర్వసాధారణం. ఒకానొక సమయంలో టమోటాను రోడ్డుమీద పారబోసిన దాఖలాలు ఉన్నాయి. మరొక సందర్భంలో కిలో ధర రూ.100 పలుకుతుంది. అయితే కొన్ని నెలల క్రితం వరకు టమోటా ధరలు పదుల్లోనే కొనసాగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు టమోటా ధరలపై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు టమోటా దిగుబడి తగ్గడం, సరఫరా నిలిచిపోవడంతో టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటివరకు పదుల్లో ఉండే టమోటా ధరలు ప్రస్తుతం రూ.130 గా ఉంది. దీంతో వినియోగదారులు మార్కెట్ కి వెళ్లాలంటేనే బయపడాల్సిన పరిస్థితి. టమోటా ధరలపై పాలకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో సామాన్యులు టమోటా కొనుగోలు చేయలేని పరిస్థితి. CM Stalin Key Decision On Tomato Prices
దేశవ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టమాటాలను రాష్ట్ర ప్రజలకు కేవలం 70 రూపాయలకు మాత్రమే అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం స్టాలిన్. ప్రభుత్వ దుకాణాల్లో ఇకనుంచి డెబ్భై రూపాయలకే టమోటాలు అందించాలన్నారు. స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయంతో తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టాలిన్ తీసుకునే ఒక్కో నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇక స్టాలిన్ వ్యవహార శైలితో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. సీఎం అంటే అదేదో పెద్ద కుర్చీ కాదని, సీఎం కూడా సాధారణ మనిషే అన్న సీఎం స్టాలిన్ మాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల స్టాలిన్ వరద ప్రాంతంలో పర్యటించారు. కాగా కాన్వాయ్ దిగి పక్కనే ఉన్న టీ కొట్టు షాపుకు వెళ్లి సాధారణ వ్యక్తిలా టీ తాగడం అక్కడి ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. Tomato Prices