Chili Price: దేశంలో కూరగాయల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో నిమ్మకాయ ధర కంటతడి పెడుతుండగా.. ఇప్పుడు మిర్చి కూడా ప్రజల జేబులకు చిల్లు పెడుతుంది. మీ అందరికీ తెలిసినట్లుగా మిర్చి వంటగదిలో ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా. ఇది అందరి ఇళ్లలో ముఖ్యమైంది. అటువంటి పరిస్థితిలో మిర్చి ధర పెరుగుదల ఆర్ధికంగా దెబ్బతీస్తుంది.
ప్రస్తుతం కిలో నిమ్మకాయ ధర రూ.200 నుంచి 300 వరకు పలుకుతుండగా, ప్రస్తుతం మార్కెట్‌లో మిర్చి కిలో రూ.60 నుంచి 80 వరకు అమ్ముడవుతోంది. దేశంలోని పలు నగరాల్లో మిర్చి ధర కిలో రూ.100కి చేరింది. మార్కెట్‌లో గతంలో కిలో మిర్చి 20 నుంచి 40 రూపాయలు పలుకగా ఇప్పుడు ఏకంగా రెండింతలు పెరిగింది.
Also Read: మిర్చి మిత్ర యాప్ తో- వినూత్న సాగు
2002లో 10,69,000 టన్నులుగా ఉన్న మిర్చి ప్రస్తుతం 20,92,000 టన్నులకు పెరిగినా ఇప్పటికీ మార్కెట్‌లో ఎలాంటి ప్రభావం చూపడం లేదని నివేదిక పేర్కొంది. మిర్చి ధర పెరగడానికి త్రిప్పుల దాడి కూడా ఒక కారణమని రైతులు చెబుతున్నారు. ఈ దాడి కారణంగా ఈ ఏడాది దాదాపు 9 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు నాశనమైందని చెబుతున్నారు. ఈసారి అకాల వర్షాల కారణంగా మిర్చి పంట భారీగా తగ్గిపోయిందని, రవాణా ఖర్చులు పెరగడంతో మిర్చి ధర కూడా పెరిగిందని అంటున్నారు.
మిర్చి సాగు రైతులకు చాలా లాభదాయకమైన వ్యవసాయం. ఇది భారతదేశంలోని ప్రధాన సుగంధ ద్రవ్యాల పంటలలో ఒకటి. భారతదేశంలో మిర్చి 792000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేయబడుతుంది.
Also Read: పురుగు మందు కొనుగోలులో జాగ్రత్తలు