ఆరోగ్యం / జీవన విధానంవార్తలు

నల్ల జామతో వృద్ధాప్య ఛాయలకు చెక్

0
Black Guva

అయితే మనం రోజూ తీసుకునే పండ్లలో జామపండు కు ప్రత్యేక స్థానం ఉంది. అందుబాటు ధరలో లభించడంతో పాటు మంచి రుచికరమైన పండు జామ పండు అని చెప్పవచ్చు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యానికి కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అపరిమిత పోషకాల నిలయంగా జామ అని చెప్పవచ్చు. రుచికి, రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం జామ పండు తినడం వల్ల చేకూరుతుంది. ఇది ఇలా ఉంటే జామ కాయ గ్రీన్ కలర్ లో ఉండటాన్ని ఇప్పటివరకు మనం చూసి ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో నల్ల జామకాయలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మాములు జామ కన్నా నల్ల జామకాయల్లో పోషక విలువలు అధికమని పలు అధ్యయనాల్లో తేలింది. నల్ల జామ కాయ తొక్క నల్లగా ఉండి లోపల ఎర్రటి గుజ్జును కలిగి ఉంటుంది. సాధారణ జామపండు తో పోలిస్తే దీంట్లో పోషకాలు రెట్టింపు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. నల్ల జామకాయలో విటమిన్స్ ,ఖనిజాలు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ జామ పండును తీసుకోవడం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని వీటిని తరచూ తీసుకోవాలి.

తాజా అధ్యయనాల ప్రకారం, మామూలు జామపండు తో పోలిస్తే దీంట్లో     కంటి సమస్యలను తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. నల్ల జామ కాయ  మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఈ పండు ఫైల్స్ సమస్యకు చెక్ పెడుతుంది. బీహార్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు 2 సంవత్సరాల క్రితం ఈ నల్ల జామకాయను నాటారు. వాటి ఫలితాలు ఇప్పుడు అందరిని  ఆకర్షిస్తుంది. ఈ పంటను త్వరలోనే వాణిజ్య సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

చూపరులను ఆకర్షించే ఈ నల్ల జామకాయల్లో పోషక విలువలు చాలా ప్రత్యేకమైనవని పరిశోధకులు చెబుతున్నారు. యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో వృద్ధాప్యాన్ని నివారించటంలో నల్ల జామ  సహాయపడుతుంది. ఈ పండ్లు తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వకుండా చేస్తోంది. చర్మంపై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. జామకాయలో పోషకాలు,విటమిన్లు, పీచు పదార్థం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాదు ఆరోగ్య పరంగా ఈ నల్ల జామకాయను తినడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని చెబుతున్నారు.

Leave Your Comments

“వరి – ఉరి ” ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ బీజెపి రైతుదీక్ష

Previous article

రైతుబంధు పై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like