Centre Must Fulfil Pending Demands Of Farmers Says SKM ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కొనసాగుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపింది సంయుక్త కిసాన్ మోర్చా. ఈ మేరకు కిసాన్ మోర్చా మాట్లాడుతూ…పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు భారత రాష్ట్రపతి తన అంగీకారం తెలిపారని, రద్దును అమలు చేయడానికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయిందని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.
SKM పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్‌లకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకుండా నిరసన ప్రదేశాల్లోనే ఉండాలని కేంద్రం బలవంతం చేస్తున్నందున రైతులకు మరియు ప్రభుత్వానికి మధ్య స్టాండ్ ఆఫ్ కొనసాగుతోంది. రైతులు సానుకూల పరిణామాల కోసం ఓపికగా ఎదురుచూస్తున్నారని, పంటలకు కనీస మద్దతు ధర పై చట్టపరమైన హామీ మరియు మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం వంటి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఇటీవలే వివాదాస్పద సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలపై రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతులు మాత్రం తమ ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. తమ డిమాండ్లకు హామీ కావాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. Samyuktha Kisan Morcha