Moisture Limit for Wheat: కేంద్రం ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకునే నిర్ణయంతో రైతులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట ధాన్యాల్లో తేమ పరిమితి శాతాన్ని తగ్గించి కొంటారన్న వాదనపై ప్రస్తుతం రైతులు అయోమయంలో పడ్డారు. వివరాలలోకి వెళితే.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ మరియు ఫుడ్ కార్పొరేషన్ మధ్య జరిగిన చర్చల ప్రకారం గోధుమలలో తేమను 14 శాతం నుండి 12 శాతానికి మరియు వరిలో 17 శాతం నుండి 16 శాతానికి తగ్గించే అవకాశం ఉంది.
కనీస మద్దతు ధరపై రైతుల నుండి ఆహార ధాన్యాలను సేకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం రైతులు 12 శాతం తేమ పరిమితి కంటే ఎక్కువ గోధుమ నిల్వలను ఎఫ్‌సిఐకి విక్రయించేటప్పుడు ఎంఎస్పిపై ధర తగ్గించి తీసుకోవాలి.అయితే 14 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న పంటను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదు. కాగా తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తే..12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న గోధుమ నిల్వలను ధర తగ్గింపుతో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉండదు.
కేంద్రం తీసుకోబోయే నిర్ణయంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. తమ ఉత్పత్తులకు మంచి ధర ఆశించడానికి ప్రభుత్వ నిర్ణయం అడ్డంకిగా మారుతుంది. పంటసేకరణ సీజన్‌కు ముందు అకాల వర్షం మరియు మండీల వద్ద షెల్టర్డ్ స్టోరేజీ స్థలం లేకపోవడంతో రైతులు తమ నిల్వలను పొడిగా ఉంచుకోవడం కష్టతరంగా మారింది. గత కొన్నేళ్లుగా మార్కెట్ లో అనేక సమస్యల కారణంగా సేకరణ ప్రక్రియ కూడా ఆలస్యం అవుతోంది. ఎక్కువ సమయం మార్కెట్ల వద్ద నిరీక్షించడం వల్ల తమ ఉత్పత్తుల నాణ్యత దెబ్బతింటుందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు
ఈ సమయంలో పాటియాలా జిల్లాకు చెందిన గోధుమ రైతు సుఖ్వీందర్ సింగ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ… వాతావరణ పరిస్థితులు మరియు ఇతర పరిస్థితులు మన నియంత్రణలో లేవు. గతేడాది గన్నీ బ్యాగుల సమస్య తలెత్తడంతో ప్రభుత్వం కొనుగోలు చేసే పంట కోసం రోజుల తరబడి మండీల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత వర్షం కూడా కురిసింది. దాంతో నా గోధుమ స్టాక్‌లో తేమ శాతం పెరిగిందని అన్నారు.
కాగా.. కోత తర్వాత, గోధుమ తేమను గ్రహిస్తుంది, వరి దానిని కోల్పోతుంది. సగటున గోధుమ పంటలో 15 నుండి 22 శాతం తేమను కలిగి ఉంటుంది. రైతులు తమ ఉత్పత్తులను పంట కోసిన తర్వాత మరియు కొనుగోళ్లకు ముందు మండీల వద్ద కూడా ఆరబెట్టుకోవాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఇదే తొలిసారి కాదు. ఇదే విధమైన ప్రతిపాదన మార్చి 2021లో చర్చకు వచ్చింది.
Also Read: వరి సేకరణలో తెలంగాణపై కేంద్రం ప్రశంస