వార్తలు

టార్గెట్ చెప్పం… వడ్లు కొనం

0
Centre disappoints Telangana again
  • వరి కొనుగోలుపై తెగేసి చెప్పిన కేంద్రం ప్రభుత్వం
  • ఢీల్లీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీల చర్చలు విఫలం
  • వరిని వద్దంటలేమంటూనే పంట మార్పిడి తప్పనిసరి అని వింత వాదన
  • రాజకీయం చేయొద్దని ఉచిత సలహా.. రాజకీయం చేసేదేమో రాష్ట్ర బీజేపీ
  • కేంద్రమంత్రితో సమావేశం నిరాశపరిచింది : మంత్రి నిరంజన్ రెడ్డి
  • సీఎంతో చర్చించాక నిర్ణయం: నిరంజన్‌రెడ్డి
  • కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి మండిపాటు

Centre disappoints Telangana again తెలంగాణాలో వరి ధాన్యం కొనుగోలు అంశానికి ఫుల్ స్టాప్ పడింది. కేంద్రం అన్నంత పని చేసింది. గత కొద్ది రోజులుగా యాసంగి పంటపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. లేదూ… యాసంగి వరి కొనుగోలు చేసే ప్రసక్తే లేదని కేంద్రం ముందు నుంచి చెప్తున్న మాట. అయితే కేంద్రం మెడలు వంచైనా రైతులకి న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి దిగింది. అందులో భాగంగా ఒకరోజు మహాధర్నా చేపట్టింది. అనంతరం ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఢిల్లీ పర్యటన చేపట్టింది. కాగా నాలుగు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా దొరక్కపోవడంతో సీఎం, మరియు బృందం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు కాగా నిన్న 26న మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆహ్వానించింది. నిన్న జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందంతో జరిపిన సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, అధికారుల బృందం తమ మాట ఏమిటో తేల్చిపారేసింది.

Centre disappoints Telangana again

భేటీ అనంతరం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం మరోమారు కేంద్రం ఆహ్వానం మేరకు చర్చలకు వచ్చామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి ఒక పరిష్కారం చూపిస్తుందన్న బలమైన ఆశతో ఢిల్లీకి వచ్చాం.. కానీ దురదృష్టవశాత్తు కేంద్రం తన వైఖరి మార్చుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గతంలో చర్చలు జరిపిన అంశాలను కొలిక్కి తీసుకురావడం కోసం కేంద్ర మంత్రి పరంపర సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం. రెండు సార్లు సమావేశం జరిగినా అశాజనకంగా వారిచ్చిన హామీ అయితే ఏమీ లేదు. ఒక విషయం స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేయవద్దని గట్టిగా చెప్పారు.

Centre disappoints Telangana again

అయితే వరి వేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులే గందరగోళం చేస్తున్నారని కేంద్రమంత్రికి మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారట. దానికి కేంద్రం… వాళ్లు తెలిసో తెలియకో మాట్లాడినారు.. అలా మాట్లాడవద్దు అని వారించినమని కేంద్ర మంత్రి గోయల్ చెప్పినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్ర మంత్రి చెబుతున్నరు. ఒక సంవత్సర కాలానికి టార్డెట్ ఎంతనో.. ఎన్ని వడ్లు తీసుకుంటారో చెప్పాలని సీఎం కేసీఆర్ కోరినారు. దానికి అనుగుణంగా రైతాంగాన్ని సన్నధం చేసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచన బాగుందని కేంద్ర మంత్రి చెప్పారు. కానీ వ్యవసాయ శాఖ వాళ్లతో మాట్లాడితే ముందస్తుగా టార్గెట్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారన్నారు. త్వరలో ఒక కమిటీ వేయబోతున్నాం.. కొత్త వ్యవసాయ చట్టాలు, కనీస మద్ధతు ధర, పంటల మార్పుకు సంబంధించి ఒక విధాన నిర్ణయం తీసుకునేందుకు కమిటీ పనిచేస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. కమిటీ నిర్ణయాన్ని బట్టి అప్పుడు చెప్తామంటున్నారు. పంట కోతలు ప్రారంభం అయి చాలా రోజులు అవుతోంది.. కొనుగోళ్లు సాగుతున్నాయి. ఈ సంవత్సరానికి ఎంత సేకరిస్తారని అడిగితే గత విధానాన్నే అవలంభిస్తామని యదాలాపంగా చెబుతున్నారు. ఏమి స్పష్టంగా చెప్పడం లేదు.. గత సమావేశంలో రాష్ట్రం తరపున 62 లక్షల ఎకరాల్లో సాగు ఉందని చెప్పినం. ముందు అంతా లేదు అని చెప్పారు.. తర్వాత 58 లక్షల ఎకరాల్లో సాగు ఉందని ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఎంత కొంటారని ఆడిగం. గత సమావేశంలో 80-85 లక్షల మెట్రిక్ టన్నులకైనా ఆలోచిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పుడేమో చెప్పలేము అంటూ దాటవేసే ధోరణితో ఉన్నారు. ఓ వైపు కొనుగోలు జరుగుతావుంటే ఎంత తీసుకుంటామో చెప్పలేని దయనియస్థితిలో కేంద్రం ఉండడం బాధాకరం. 40 లక్షల మెట్రిక టన్నులకు ముందుగా టార్గెట్ ఇచ్చారు.. తర్వాత పెంచాలని కోరినం. సంవత్సరం టార్గెట్ ఇస్తారనుకున్నాం అది ఇవ్వలేదు. ఒక్కటే.. యాసంగిలో వడ్లు వేయవద్దు అని మాత్రం గట్టిగా చెప్పారని మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాకు వివరించారు. Centre disappoints Telangana again

 

Leave Your Comments

అంబానీ ఇంట్లో ఒక్కో మొక్క ధర లక్షల్లో…

Previous article

వ్యవసాయంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం వాయిదా…

Next article

You may also like