జాతీయంవార్తలు

Broken Rice: మొక్కజొన్నకి ధర పెరగడంతో నూకలకి పెరిగిన డిమాండ్

0
Rice
Rice

Broken Rice: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మొక్కజొన్న ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఇప్పుడు చాలా దేశాలు బ్రోకెన్ బియ్యాన్ని (నూకలు) కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కసారిగా విరిగిన బియ్యానికి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు కూడా పెరిగాయి. దీంతో క్వింటాల్ రూ.2100కి చేరింది.

Maize

Maize

వాస్తవానికి పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలలో మొక్కజొన్నకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. అక్కడ కోళ్లకు, పశువులకు మేతగా మొక్కజొన్న ఉపయోగిస్తారు. ధర పెరగడంతో ప్రస్తుతం ఇక్కడ విరిగిన బియ్యాన్ని ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు.

Also Read: ట్రాలీ బకెట్ మిల్కింగ్ మెషిన్ మరియు దాని ప్రత్యేకత

బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా, గల్ఫ్ దేశాలలో మొక్కజొన్నకు భారీ డిమాండ్ ఉందని కోల్‌కతాకు చెందిన ప్రైవేట్ ఎగుమతి కంపెనీ బెంగానీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బిమల్ బెంగానీ బిజినెస్ లైన్‌తో అన్నారు. రస్సో-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మొక్కజొన్న సరఫరా బాగా దెబ్బతిందని చెప్పారు. ఈ కారణంగా ఇండోనేషియా, వియత్నాం కంపెనీలు విరిగిన బియ్యాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

Broken Rice

Broken Rice

మొక్కజొన్న ధర క్వింటాల్రూ.2500

ప్రస్తుతం మొక్కజొన్న సీజన్ ముగియడంతో నిల్వలు లేక వీటి ధరలు అమాంతం పెరిగాయి. క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1870 ఉండగా ప్రస్తుతం రూ.2200 నుంచి 2500 వరకు విక్రయిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం మొక్కజొన్న ఎగుమతుల్లో ఉక్రెయిన్ ఒక్కటే 16 శాతం వాటా కలిగి ఉంది. యుద్ధం కారణంగా ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి

దీని ప్రభావం ధరలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని రకాల మొక్కజొన్నలు వియత్నాం, ఇండోనేషియా (Indonesia) దేశాలకు ఎగుమతి అవుతున్నాయని బల్క్ లాజిక్స్ డైరెక్టర్ వీఆర్ సాగర్ చెబుతున్నారు. అదే విధంగా బంగ్లాదేశ్‌కు (Bangladesh) రోడ్డు మార్గంలో ట్రక్కుల ద్వారా పెద్దఎత్తున మొక్కజొన్న ఎగుమతి అవుతోంది. వస్తువుల లభ్యత, రవాణా కారణంగా ఎగుమతిదారులు చాలా పరిమిత పరిమాణంలో ఆర్డర్‌లను తీసుకుంటున్నారు.

Also Read: గ్రీన్‌హౌస్‌లో సాగు విధానం

Leave Your Comments

Desuckering in Banana: అరటి పంట లో డీసక్కరింగ్ తో లాభాలు

Previous article

Water management in sesame: రబీ నువ్వుల పంట లో నీటి యాజమాన్యం

Next article

You may also like