వార్తలు

పండ్ల తోటల్లో బోరాన్ లోపం ఏర్పడటానికి కారణాలు..

0

తెలుగు రాష్ట్రాలలో మామిడి, బొప్పాయి, జామ, సపోట, నిమ్మ, అరటి, బత్తాయి పండ్ల తోటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఈ పండ్ల తోటల సాగుకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలును సరైన మోతాదులో, సరైన సమయంలో అందించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రధానపోషకాలు మొక్కకి అందుబాటులో ఉన్నప్పటికి, సూక్ష్మపోషకలోపాలు ఉంటే దిగుబడులు తగ్గటాన్ని గమనించవచ్చు. సూక్ష్మపోషకాలులో ముఖ్యమైనటువంటి బోరాన్ లోపించింవినట్లయితే పూత తగ్గడమేగాక, పండ్ల దిగుబడి, నాణ్యత లోపించి  మార్కెట్లో సరైన ధర లభించక రైతులకు నష్టం కలుగుతుంది.

వివిధ పండ్ల తోటల్లో బోరాన్ లోపం ఏర్పడటానికి కారణాలు:

  • భూమిలో బోరాన్ గాఢత 5 పి.పి.ఎం. కన్నా తక్కువైనప్పుడు.
  • నేలలో సేంద్రియ పదార్థం 75% కన్నా తక్కువైనప్పుడు.
  • నేలలో ఉదజని సూచిక 8 కన్నా తక్కువగా ఉన్న ఆమ్ల నేలల్లోను, సూచిక 8.0 కన్నా ఎక్కువగా ఉన్న క్షార నేలల్లోను బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.
  • భాస్వరం, పొటాషియ ఎరువులను అధికంగా వాడినప్పుడు.
  • సున్నం అధికంగా గల భూముల్లో సాగు చేసినప్పుడు.
  • ఎండ తీవ్రత, వేడిగాలులు అధికంగా ఉన్న బెట్ట పరిస్థితు ఏర్పడినప్పుడు.
  • లవణాలు అధికంగా గల (కార్బోనేట్స్, బైకార్బోనేట్స్) నీటిని సాగు నీరుగా అందించినప్పుడు.
  • అధిక వర్షపాతం, ఉష్ణోగ్రతలు (>33) ఉన్నప్పుడు.
  • బోరాన్ ధాతువుకు అధికంగా నీటిలో కరిగే స్వభావం మూలంగా, వర్షపాతం అధికమైనప్పుడు భూమిలో బోరాన్ వర్షపు నీటికి కరిగి కొట్టుకుపోతుంది.

బోరాన్ ధాతువు అధికంగా కిరణజన్య సంయోగక్రియ ద్వార తయారైన పిండిపదార్థాల సక్రమ రవాణలోను, పుప్పొడి రేణువులు మొలకెత్తుటకు, చీడ, పీడలు ఆశించకూండా మొక్కలను కాపాడే ఫినాల్స్ తయారిలోను, కణవిభజనలోను, కణాలు వివిధ కణజాలాలుగా మార్పు చెందటంలోను, కణత్వచం అవిభక్తంగా ఉండటంలోను తోడ్పడుతుంది.

బోరాన్ ధాతువు తక్షణమే కదిలే స్వభావం లేకపోవడం వల్ల, ముదురు ఆకుల్లో ఉన్న బోరాన్ లేత ఆకులకు, కొమ్మలకు బదిలీ కాకపోవడం మూలంగా బోరాన్ లోప లక్షణాలు ముందుగా లేత ఆకులు , కొమ్మల్లో గమనించవచ్చు.

Leave Your Comments

పట్టుపురుగుల పెంపకం – సస్యరక్షణ

Previous article

వేరుశనగపంటలో పురుగులు – నివారణ చర్యలు

Next article

You may also like