USES OF DRUMSTICK LEAVES: మునగ (మోరింగ)ను సాధారణంగా కాయల కోసం పండిస్తారు. అయితే మునగ చెట్టు వేరు, కాండం, ఆకులు, పూలు, గింజలు అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వీటిని ఆయుర్వేద, ఇతర సాంప్రదాయ ఔషధాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా మునగ ఆకు ఎన్నో జబ్బులను తగ్గించే గుణాలున్నట్లు ఆయుర్వేద చెబుతుంది. మనకు దొరికే అన్నీ ఆకు కూరల్లో కంటే మునగ ఆకుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి, వ్యాధులను నివారించడానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. సాధారణంగా మునగ ఆకులను వేయించి, ఇతర కూరగాయలతో కలిపి వంటల్లో పోషక విలువలను పెంచుతారు. దీనిని వారానికి ఒక్కసారైనా తిన్నట్లయితే ఎన్నోరోగాలు తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు.
మునగ ఆకుల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఆకుల్లో మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, థయామిన్(విటమిన్ బి)
1), రైబోఫ్లావిన్ (విటమిన్ బి)
2), నియాసిన్ (విటమిన్ బి)
3), ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి) లు ఉంటాయి.
పొటాషియం, కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, మెగ్నీషియం, సోడియం మొదలైనవి మునగలో పుష్కలంగా లభిస్తాయి. యాంటీఆక్సీడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల శరీరంలో ప్రతి అవయవానికి వచ్చే ఇబ్బందికి పరిష్కారం చూపుతుంది. మునగ ఆకుల్లో దాదాపు 18 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. మునగ ఆకుల్లో నారింజలో కన్నా 7 రెట్లు ఎక్కువ విటమిన్ ‘సి’ ఉంటుంది. పెరుగులో కంటే 8 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు ఉంటాయి. అలాగే అరటిపండులో కన్నా15 రెట్లు ఎక్కువ పొటాషియం లభిస్తుంది. కావున మునగ కాడలే గాకుండా సంవత్సరం పొడవునా లభ్యమయ్యే ఆకులను వివిధ రూపంలో రోజువారి వంటకాలలో వాడుకోవచ్చు. ఒత్తిడి, మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక జబ్బులను నివారించడంలో మునగ అకులు తోడ్పడుతాయి.
ALSO READ: LEAFY VEGETABLES: మీకు తెలుసా …? బచ్చలి కూర ఎందుకు తినాలి ?